☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్‌ఐఏ

Smit Machchhar : భారతీయ కెప్టెన్‌ స్మిత్ మచ్చర్‌పై జరిగిన దాడిపై విచారణ చేయాల్సిందిగా ఎన్‌ఐఏ సంస్థను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల ఫ్లైదుబాయ్ విమానంలో భారతీయ కెప్టెన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే.
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్‌ఐఏ

Smit Machchhar : ఇటీవల ఫ్లైదుబాయ్ విమాన ఘటన గురించి తెలిసిందే. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న విమానాన్ని ఒమన్‌కు చెందిన కో పైలట్ కూల్చేందుకు ప్రయత్నించగా.. భారతీయ పైలట్, కెప్టెన్ స్మిత్ మచ్చర్ అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పుడు కేంద్రం మరోసారి స్పందించింది. భారతీయ కెప్టెన్‌పై జరిగిన దాడిపై విచారణ చేయాల్సిందిగా ఎన్‌ఐఏ సంస్థను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

గత సెప్టెంబర్ 30న ఫ్లై దుబాయ్ సంస్తకు చెందిన విమానం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ (టెల్ అవీవ్) వెళ్తుండగా.. ఒమనీ కో పైలట్ ఆ విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడు. దీన్ని భారతీయుడైన పైలట్, కెప్టెన్ స్మిత్ మచ్చర్ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోంది. స్మిత్ మచ్చర్ సాహసం వల్ల విమానంలోని 174 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న అదనపు పైలట్లు విమానాన్ని సౌదీకి దారి మళ్లించి, అక్కడ సురక్షితంగా ల్యాండ్ చేశారు.

ప్రస్తుతం ఈ అంశంపై అటు ఇజ్రాయెల్, దుబాయ్, సౌదీ ప్రభుత్వాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇదే సమయంలో ఇప్పుడు ఇండియా కూడా ఎన్‌ఐఏ ద్వారా విచారణకు ఆదేశించింది. యాంటీ హైజాకింగ్ యాక్ట్, 2016లోని సెక్షన్ 3తోపాటు మరికొన్ని సెక్షన్ల కింద దర్యాప్తు చేయనుంది ఎన్‌ఐఏ. ఈ ఘటన వెనుక ఉన్న కుట్ర, విమానంలో జరిగిన పరిణామాలు, ఇతర అంశాల్ని ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తుంది. అనంతరం కేంద్రానికి నివేదిక అందిస్తుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో కేసు నమోదు చేసిన ఎన్‌ఐఏ.. విచారణ ప్రారంభించనుంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← గేమ్‌ను మలుపు తిప్పేది ఎవరు?: ఇంట్లో కూర్చుని బౌలింగ్ వ్యూహాలు రచించిన సూర్యGautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్‌.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com