Gautam Prasad | మీ నాన్న కార్మిక శాఖా మంత్రిగా ఉండి ఏం పీకుతున్నడని ఎంపీ గడ్డం వంశీకృష్ణను బీఆర్ఎస్ నాయకుడు గౌతం ప్రసాద్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గౌతం ప్రసాద్ మాట్లాడుతూ.. మీ నాన్న ఏం పీకి కట్టలు కడుతున్నడు.. మీ నాన్నతోని ఈ రాష్ట్రానికి ఏం ఉపయోగముందని ప్రశ్నించారు.
ఇండస్ట్రీల పేర్లతో ఎగదోచుకున్న, దోచుకున్న డబ్బు కాపాడుకోవడం కోసం పూటకో పార్టీ మార్చుకుంటూ.. మీ రాజకీయ పబ్బాన్ని గడుపుకుంటూ ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారా.. మీరు.. ఇది మీరు చేస్తున్న రాజకీయం.. మీ సంపాదనను కాపాడుకునేందుకు, వేల కోట్ల రూపాయల భూమిని కాపాడుకోవడం కోసం పార్టీ మారి ప్రభుత్వం మారంగానే మళ్లీ కండువా మార్చుకుని ప్రజల ముందుకొచ్చే వ్యవహారం పెట్టుకున్న మీరు, మీ ముఖాలు పెట్టుకొని మా కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయా మీది.. వెంట్రుక కృష్ణ.. వంశీకృష్ణ నువ్వు మా కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయా.. మా నాయకుడి గురించి మాట్లాడే స్థాయా నీది.. సిగ్గు లేదు..నీకు కొంచెమన్నా.. వెంట్రుకల గురించి మాట్లాడటానికి అంటూ వార్నింగ్ ఇచ్చారు.
రూ.4,210 కోట్లు రూపాయల రైల్వే ప్రాజెక్ట్ ఈ రోజు పెండింగ్‌లో ఉంది. దాని పొడువు 137 కిలోమీటర్లు.. డబ్బులు మంజూరైనా క్షేత్రస్థాయిలో దాని పనులు మొదలు కాలేదు.. ఏం చేస్తున్నవ్.. ఏం పీకుతున్నవో సమాజానికి సమాధానం చెప్పు.. ఎంపీ వెంట్రుక వంశీకృష్ణ నిన్నడుగుతున్నం.. నీకు దమ్ముంటే.. ధైర్యముంటే.. సత్తా ఉంటే ప్రజల ముందుకొచ్చి సమాధానం చెప్పు.. అని గౌతం ప్రసాద్ సవాల్ విసిరారు.
నీ అయ్య పరిశ్రమల పేరుతో దోచుకున్న డబ్బులు కాపాడుకోవడానికి పూటకో పార్టీ మారుతాడు
నీకు కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయి ఉందా గడ్డం వంశీ కృష్ణ?
కార్మిక శాఖ మంత్రిగా నీ అయ్య రాష్ట్రానికి పీకి కట్టలు కట్టింది ఏంది?
– బీఆర్ఎస్ నాయకుడు గౌతం ప్రసాద్ https://t.co/kWsplLPBzH
— Telugu Scribe (@TeluguScribe) October 10, 2026
4వేల కోట్ల రైల్వే ప్రాజెక్టు పెండింగ్‌లో ఉంటే ఏం పీకుతున్నావు, వెంట్రుక పీకుతున్నవా ఎంపీ వంశీ కృష్ణ?
– బీఆర్ఎస్ నాయకుడు గౌతం ప్రసాద్ https://t.co/lgYkRbHeoX
— Telugu Scribe (@TeluguScribe) October 10, 2026
Read Also :
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!






