☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!

Ranabaali | టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన తాజా చిత్రానికి సంబంధించి ఒక సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తుంది.
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!

Vijay Devarakonda | టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన తాజా చిత్రానికి సంబంధించి ఒక సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న తన కొత్త సినిమా ‘రణబాలి’ విడుదల వేళ, టికెట్ల ధరల పెంపు గురించి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ నేపథ్యంలో విజయ్ స్వయంగా రంగంలోకి దిగి ఈ అంశంపై మాట్లాడుతూ.. ఇకపై తాను నటించే ఏ చిత్రానికి కూడా అదనపు టికెట్ రేట్లు లేదా ప్రత్యేక హైక్స్ ఉండే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పిన‌ట్లు తెలుస్తుంది. రణబాలి చిత్రానికి సంబంధించి కూడా ఎలాంటి రేట్ల పెంపు కోరుకోవడం లేదని మేకర్స్ స్పష్టం చేసిన తరుణంలో, విజయ్ చేసిన ఈ ప్రకటన సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ నిర్ణ‌యంలో ఓ చిన్న మెలిక కూడా ఉంది. ఒకవేళ భవిష్యత్తులో దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశం వస్తే మాత్రం ఆ ఒక్క సినిమాకు మినహాయింపు ఉంటుందని, మిగతా అన్ని సినిమాలకూ సాధారణ ధరలే వర్తిస్తాయని ఆయన కుండబద్దలు కొట్టిన‌ట్లు స‌మాచారం. అయితే ఈ నిర్ణయంపై విజ‌య్ నుంచి కానీ అత‌డి టీమ్ నుంచి కానీ ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. మ‌రోవైపు టికెట్ ధ‌ర‌ల పెంపు విష‌యంలో విజయ్ దేవరకొండ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఈ భారీ అంచనాల చిత్రం ‘రణబాలి’ అక్టోబర్ 16న అత్యంత ఘనంగా థియేటర్లలో సందడి చేయనుంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్‌.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’Medical Tests | ప్ర‌తి ఒక్క‌రు త‌ర‌చూ చేయించుకోవాల్సిన ముఖ్య‌మైన వైద్య ప‌రీక్ష‌లు ఇవే.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com