☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Nivetha Pethuraj | సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నా.. నివేదా పేతురాజ్ సంచలన విషయాలు

Nivetha Pethuraj | ‘మెంటల్ మది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి నివేదా పేతురాజ్ తన అందం, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె.. ఓ దశలో సినిమాలకు పూర్తిగా దూరమవ్వాలని కూడా నిర్ణయించుకున్నారట.
Nivetha Pethuraj | సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నా.. నివేదా పేతురాజ్ సంచలన విషయాలు

Nivetha Pethuraj | ‘మెంటల్ మది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి నివేదా పేతురాజ్ తన అందం, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె.. ఓ దశలో సినిమాలకు పూర్తిగా దూరమవ్వాలని కూడా నిర్ణయించుకున్నారట. కొన్ని వ్యక్తిగత పరిస్థితులు, తీసుకున్న నిర్ణయాల కారణంగా తీవ్ర ఒత్తిడికి గురైన నివేదా.. ఏకంగా హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేసుకుంటూ జీవించాలని అనుకున్నానని తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం మాత్రం మళ్లీ వరుస అవకాశాలతో నటిగా బిజీ అవుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’లో ఆమె కీలక పాత్రలో నటిస్తున్నారు.

కొన్నేళ్ల క్రితం తన రూపంలో మార్పులు చేసుకోవాలనే ఆలోచన తనకు వచ్చిందని నివేదా తెలిపారు. ముఖ్యంగా పెదవుల ఆకారం కోసం శస్త్రచికిత్స చేయించుకోవాలని అనుకున్నారట. ఈ విషయంపై తన వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించగా.. ఆయన తీవ్రంగా మందలించడంతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి వివరించారని చెప్పారు. దీంతో ఆ ఆలోచనను విరమించుకున్నట్లు తెలిపారు. సాయి పల్లవి, నిత్యామీనన్ వంటి నటీమణులు ఎలాంటి శస్త్రచికిత్సలు చేయించుకోకుండానే, తమ సహజ రూపంతోనే ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారని గుర్తుచేసుకున్నారు. వాళ్లను చూసిన తర్వాత తనకు కూడా తన రూపం గురించి అనవసరంగా ఎందుకు ఆలోచిస్తున్నాననే విషయం అర్థమైందని నివేదా పేర్కొన్నారు.

తనకు ఒక విచిత్రమైన అనుభవం ఉందని నివేదా చెప్పారు. తాను మనసులో ఏదైనా ప్రతికూలంగా ఊహించుకుంటే అది నిజమైపోతుందనే భావన కలిగేదని తెలిపారు. తన వ్యక్తిగత జీవితంలోనూ అలాంటి సంఘటన ఎదురైందని చెప్పారు. తన మాజీ ప్రియుడు తనను ఎవరి కోసం వదిలి వెళ్లొచ్చనే విషయాన్ని ముందే ఊహించానని, చివరకు అదే జరిగిందని వెల్లడించారు. ఆ తర్వాత నుంచి ఏ విషయాన్నీ ముందుగానే ఊహించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. అయితే మనసులో ఆలోచనలు రావడం సహజమే కదా అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు., 2023లో సినిమాలు మానేయాలని నిర్ణయించుకున్నానని నివేదా తెలిపారు. ఆ సమయంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానని, దాని ప్రభావంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని చెప్పారు. డిప్రెషన్‌తో పాటు పానిక్ అటాక్స్ కూడా ఎదురయ్యాయని వెల్లడించారు. ఆ పరిస్థితుల నుంచి బయటపడటానికి చాలా కష్టపడ్డానని చెప్పిన నివేదా.. మళ్లీ సినిమా అవకాశాలు రాకపోతే హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేసుకుంటూ జీవించాలని కూడా నిర్ణయించుకున్నానని తెలిపారు. అయితే పరిస్థితులు మారడంతో మళ్లీ నటనపై దృష్టి పెట్టానని చెప్పారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← జహీరాబాద్‌లో మొరాయిస్తున్న ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు.. వాహనదారుల ఇక్కట్లుBigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు 10లో నాగార్జున మార్క్ క్లాస్.. మిథిలేష్‌కు రూ.15 లక్షల ఆఫర్,చివరికి ఏం జరిగిందంటే? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com