☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు 10లో నాగార్జున మార్క్ క్లాస్.. మిథిలేష్‌కు రూ.15 లక్షల ఆఫర్,చివరికి ఏం జరిగిందంటే?

Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు, టాస్కులు, వ్యూహాలు ఒకవైపు కొనసాగుతుంటే.. మరోవైపు వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున వచ్చి కంటెస్టెంట్ల ఆటతీరును సమీక్షించడం మరింత ఉత్కంఠను పెంచుతోంది. డే 20 ఎపిసోడ్‌లోనూ నాగార్జున పలువురు కంటెస్టెంట్లకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు
Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు 10లో నాగార్జున మార్క్ క్లాస్.. మిథిలేష్‌కు రూ.15 లక్షల ఆఫర్,చివరికి ఏం జరిగిందంటే?

Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు, టాస్కులు, వ్యూహాలు ఒకవైపు కొనసాగుతుంటే.. మరోవైపు వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున వచ్చి కంటెస్టెంట్ల ఆటతీరును సమీక్షించడం మరింత ఉత్కంఠను పెంచుతోంది. డే 20 ఎపిసోడ్‌లోనూ నాగార్జున పలువురు కంటెస్టెంట్లకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. అదే సమయంలో కొందరి గేమ్‌ను ప్రశంసిస్తూ వారికి మద్దతుగా నిలిచారు.గత వారం రోజులుగా హౌస్‌లో జరిగిన సంఘటనలను ప్రస్తావించిన నాగార్జున.. కంటెస్టెంట్ల ప్రవర్తన, టాస్కుల్లో వారి ఆటతీరును ఒక్కొక్కటిగా విశ్లేషించారు. ముఖ్యంగా సుధీర్, సృష్టి మధ్య జరిగిన వివాదంపై ప్రత్యేకంగా మాట్లాడారు. సుధీర్ ఉపయోగించిన అనుచితమైన పదంపై నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేసి, మరోసారి అలాంటి పదజాలం ఉపయోగించకుండా గట్టిగా హెచ్చరించారు.

ఇక చరణ్ విషయంలోనూ నాగార్జున సీరియస్‌గా స్పందించారు. తనకు వచ్చిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇతరుల గురించి మాట్లాడే ముందు తనకు లభించిన అవకాశాలపై దృష్టి పెట్టాలని చరణ్‌కు స్పష్టం చేశారు. అమన్, వర్షిణి విషయంలో జరిగిన ఘటనపైనా నాగార్జున క్లారిటీ ఇచ్చారు. గేమ్ సమయంలో అమన్ ప్రవర్తనపై వర్షిణి అసౌకర్యంగా ఫీల్ అయిన అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఆ ఘటనలో అమన్ ఉద్దేశపూర్వకంగా తప్పు చేయలేదనే విషయాన్ని వివరించారు. అదే సమయంలో అమన్‌ను ‘పప్పుగాడు’ అంటూ చేసిన వ్యాఖ్యలపైనా నాగార్జున స్పందించారు. టాస్కుల్లో నియమాలను పాటిస్తూ తనకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తిస్తున్న అమన్‌ను అలా పిలవడం సరికాదని చెప్పినట్లు ఎపిసోడ్‌లో కనిపించింది.

మరోవైపు దేబ్‌జానీకి కూడా నాగార్జున గతంలో ఇచ్చిన సూచనలను మరోసారి గుర్తు చేశారు. అవసరం లేని మాటలు, వ్యక్తిగత విమర్శలు తగ్గించుకోవాలని సూచించారు. హౌస్‌లో నియమాలు ఉల్లంఘించడం, వ్యక్తిగత విషయాలను గొడవల్లోకి తీసుకురావడం వంటి అంశాలపై కంటెస్టెంట్లకు హెచ్చరికలు చేశారు. ఇక రామ్ ప్రసాద్ విషయంలో మాత్రం నాగార్జున ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రామ్ ప్రసాద్ ఆటతీరును కొందరు ‘కన్నింగ్’గా అభివర్ణించిన నేపథ్యంలో.. అది కన్నింగ్ గేమ్ కాదని, వ్యూహాత్మకంగా ఆడిన ఆట అని నాగార్జున పేర్కొన్నారు. అతడి వ్యూహాన్ని ప్రశంసిస్తూ ఇక నుంచి రామ్ ప్రసాద్‌ను ‘చాణక్యుడు’ అని పిలుస్తానంటూ సరదాగా బిరుదు కూడా ఇచ్చారు.

నరేష్ ఆటతీరుపై కూడా నాగార్జున ప్రశంసలు కురిపించారు. హౌస్‌లో పాజిటివిటీని కొనసాగిస్తూ బాగా ఆడుతున్నాడని కితాబిచ్చారు. అదే సమయంలో ముఖేష్, వర్షిణికి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక టెంపర్ వంశీ గేమ్‌పై నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఎపిసోడ్‌లో చూపించారు. హౌస్‌లో తన ఉనికిని మరింతగా చూపించాల్సిన అవసరం ఉందని, ఆటపై దృష్టి పెట్టాలని సూచించారు.ఇక త్రిగుణ్ విషయంలో ఎపిసోడ్‌లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. సంచాలక్‌గా అతడు తీసుకున్న నిర్ణయాన్ని పలువురు కంటెస్టెంట్లు వ్యతిరేకించారు. అయితే నాగార్జున వీడియోను ప్లే చేసి, త్రిగుణ్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని వివరించారు. దీంతో త్రిగుణ్‌పై వచ్చిన విమర్శలకు అక్కడే క్లారిటీ ఇచ్చారు.

అయితే ఎపిసోడ్ చివర్లో నాగార్జున ఇచ్చిన ట్విస్ట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. బిగ్ బాస్ హౌస్ నుంచి ఇప్పటికిప్పుడు బయటకు వెళ్లిపోవాలనుకునే కంటెస్టెంట్‌కు డబ్బు ఆఫర్ చేస్తామని ప్రకటించారు. మొదట రూ.5 లక్షలు, ఆ తర్వాత రూ.10 లక్షలు, చివరగా రూ.15 లక్షల వరకు ఆఫర్ పెంచారు.ఈ భారీ ఆఫర్‌కు మిథిలేష్ స్పందించారు. హౌస్‌లోని సభ్యులు అతడిని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ.. చివరకు మిథిలేష్ రూ.15 లక్షల ఆఫర్‌ను అంగీకరించినట్లు ఎపిసోడ్‌లో చూపించారు. అయితే ఈ రూ.15 లక్షలు అదనంగా లభించే మొత్తం కాదని, బిగ్ బాస్ విజేతకు అందే ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతాయని నాగార్జున స్పష్టం చేశారు.దీంతో డే 20 ఎపిసోడ్‌లో ఒకవైపు కంటెస్టెంట్ల గేమ్‌పై నాగార్జున చేసిన సమీక్ష, మరోవైపు మిథిలేష్ తీసుకున్న రూ.15 లక్షల నిర్ణయం ప్రధాన చర్చగా మారాయి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Nivetha Pethuraj | సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నా.. నివేదా పేతురాజ్ సంచలన విషయాలుThe Paradise | వీక్ డేస్‌లోను తగ్గని ‘ది ప్యారడైజ్’ జోరు.. మూడో రోజు కూడా భారీ బుకింగ్స్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com