☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

The Paradise | వీక్ డేస్‌లోను తగ్గని ‘ది ప్యారడైజ్’ జోరు.. మూడో రోజు కూడా భారీ బుకింగ్స్!

The Paradise | నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ దగ్గర మంచి వ‌సూళ్లు రాబ‌డుతుంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ‘ది ప్యారడైజ్’ రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.115 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.
The Paradise | వీక్ డేస్‌లోను తగ్గని ‘ది ప్యారడైజ్’ జోరు.. మూడో రోజు కూడా భారీ బుకింగ్స్!

The Paradise | నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ దగ్గర మంచి వ‌సూళ్లు రాబ‌డుతుంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ‘ది ప్యారడైజ్’ రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.115 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. మూడో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సినిమాకు మంచి స్పందన ఉన్న విషయాన్ని సూచిస్తున్నాయి. ప్రముఖ టికెట్ బుకింగ్ వేదిక బుక్ మై షోలో మూడో రోజు ‘ది ప్యారడైజ్’కు గణనీయమైన బుకింగ్స్ నమోదైనట్లు సమాచారం. మూడో రోజు సుమారు 2.52 లక్షల టికెట్లు విక్రయమైనట్లు తెలుస్తోంది. ఇది రెండో రోజుతో దాదాపు సమానంగా ఉండ‌డం గమనార్హం.

నాని గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కావడం, ముందస్తు బుకింగ్స్‌కు మంచి స్పందన రావడం కూడా ప్రారంభ వసూళ్లకు కారణంగా చెప్పుకోవచ్చు. అయితే తొలి వారంలో సినిమా ఏ స్థాయిలో నిలబడుతుందనేది కీలకం. ప్రారంభ వసూళ్లు భారీగా ఉండటం ఒక అంశమైతే.. రోజులు గడిచేకొద్దీ థియేటర్లలో ఆక్యుపెన్సీని కొనసాగించడం మరో అంశం. మూడో రోజు బుకింగ్స్ రెండో రోజుకు దగ్గరగా ఉండటం ప్రస్తుతానికి సినిమాకు సానుకూల సంకేతంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ‘ది ప్యారడైజ్’ చిత్రబృందం తాజాగా మీడియా సమావేశంలో పాల్గొని సినిమాకు సంబంధించిన అనుభవాలను పంచుకుంది. నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ భారీ చిత్రాన్ని నిర్మించగా.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు.

సినిమా తెరకెక్కించిన విధానం, షూటింగ్ సమయంలో ఎదురైన అనుభవాలు, ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన వంటి అంశాలపై చిత్రబృందం మాట్లాడినట్లు సమాచారం. సినిమా విడుదల తర్వాత వస్తున్న భిన్నమైన అభిప్రాయాలపై కూడా చిత్రబృందం తమ అభిప్రాయాలను వెల్లడించింది. ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’కు అసలు పరీక్ష మొదటి వారం ముగిసే సమయానికి ఉండనుంది. రెండు రోజుల్లో రూ.115 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు వస్తున్న ట్రేడ్ లెక్కలు, మూడో రోజు కూడా 2.52 లక్షల టికెట్ల బుకింగ్స్ నమోదవడం సినిమా స‌త్తా చాటుతుంది. మొత్తంగా మూడో రోజు కూడా బుకింగ్స్‌లో పెద్దగా తగ్గుదల కనిపించకపోవడంతో నాని అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. ఇప్పుడు వారాంతపు వసూళ్లు ఎలా ఉంటాయి? తొలి వారం పూర్తయ్యే సరికి సినిమా ఎంత వసూలు చేస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు 10లో నాగార్జున మార్క్ క్లాస్.. మిథిలేష్‌కు రూ.15 లక్షల ఆఫర్,చివరికి ఏం జరిగిందంటే?TET Results | ఇన్‌ సర్వీస్‌ టెట్‌ ఫలితాలు రిలీజ్‌.. 6,728 మంది టీచర్లు ఫెయిల్‌ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com