☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

కొత్త ఇన్సూరెన్స్ రూల్స్: ఫోన్ నంబర్, ఈమెయిల్ ఇవ్వకుండానే పాలసీ రేట్లు తెలుసుకోవచ్చు!

కొత్త ఇన్సూరెన్స్ రూల్స్: ఫోన్ నంబర్, ఈమెయిల్ ఇవ్వకుండానే పాలసీ రేట్లు తెలుసుకోవచ్చు!
కొత్త ఇన్సూరెన్స్ రూల్స్: ఫోన్ నంబర్, ఈమెయిల్ ఇవ్వకుండానే పాలసీ రేట్లు తెలుసుకోవచ్చు!
కొత్త ఇన్సూరెన్స్ రూల్స్: ఫోన్ నంబర్, ఈమెయిల్ ఇవ్వకుండానే పాలసీ రేట్లు తెలుసుకోవచ్చు!

ఇన్సూరెన్స్ రంగంలో కీలక సంస్కరణలకు రెగ్యులేటర్ IRDAI శ్రీకారం చుట్టింది. పాలసీ వివరాలు, పాలసీ రేట్లను తెలుసుకోవాలంటే కచ్చితంగా కస్టమర్లు తమ పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్ వంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వాలనే నిబంధనకు త్వరలోనే ముగింపు రానుంది. వినియోగదారుల గోప్యతను కాపాడే లక్ష్యంతో ఐఆర్‌డీఏఐ ఈ నూతన ప్రతిపాదనలను తీసుకొచ్చింది. ఈ మేరకు ఇటీవలే ఒక కన్సల్టేషన్ పేపర్ విడుదల చేసింది.

ప్రస్తుతం అనేక ఇన్సూరెన్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్ల వెబ్‌సైట్లలో పాలసీ వివరాలు చూడటానికి ప్రయత్నిస్తే కస్టమర్లను ముందే పర్సనల్ డిటైల్స్ అడుగుతున్నారు. దీన్ని ఐఆర్‌డీఏఐ డార్క్ ప్యాటర్న్‌గా పేర్కొంది. కేవలం లీడ్ జనరేషన్ అంటే కొత్త కస్టమర్ల సమాచారం సేకరించడం కోసం ఈ పద్ధతిని వాడుతున్నారని రెగ్యులేటరీ సంస్థ గుర్తించింది. ఇకపై ఇలాంటి అనైతిక వ్యాపార పద్ధతులను ఇన్సూరెన్స్ రూల్స్ ప్రకారం పూర్తిగా నిషేధించాలని ఐఆర్‌డీఏఐ తన ప్రతిపాదనలో స్పష్టం చేసింది.

ఈ కొత్త నిబంధనల ద్వారా వినియోగదారులు ఎలాంటి వ్యక్తిగత సమాచారం ఇవ్వకుండానే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ షీట్, బ్రోచర్లు, తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ), ప్రీమియం రేట్లు, పనితీరు వంటి వివరాలను సులభంగా పొందవచ్చు. క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో, ఫిర్యాదుల పరిష్కార వివరాలు కూడా సులభంగా అర్థమయ్యేలా ఒకే పేజీలో అందుబాటులో ఉంచాలని తాజా కన్సల్టేషన్ పత్రం సూచిస్తోంది.

ALSO READ : పండుగల వేళ సామాన్యులకు శుభవార్త

ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే వినియోగదారులకు అనవసరమైన ఫోన్ కాల్స్, స్పామ్ మెసేజ్‌ల బెడద తప్పుతుంది. అలాగే ఇన్సూరెన్స్ రంగంలో పారదర్శకత పెరుగుతుంది. కస్టమర్లు ఏ వెబ్‌సైట్‌కైనా భయపడకుండా వెళ్లి.. తమకు నచ్చిన పాలసీలను ఎలాంటి ఒత్తిడి లేకుండా పోల్చి చూసుకునేందుకు అవకాశం లభిస్తుంది. దీనివల్ల ప్రజల ఇన్సూరెన్స్ కొనుగోలు ప్రక్రియ మరింత సులువుగా అలాగే తమకు నచ్చిన విధంగా పారదర్శకంగా మారుతుందని నిపుణులు అంటున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG
← బాచుపల్లి ఫ్లైఓవర్ పై డాన్స్ రీల్స్... అర్థరాత్రి రోడ్డుపై రెచ్చిపోతున్న యువత..సభ్యసమాజం తలదించుకునే ఘటన: MLA ఫామ్‌హౌస్‌లో యువతిపై పోలీసుల గ్యాంగ్ రేప్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com