☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

Greater Noida | టీ, నూడుల్స్ కార‌ణం కాదు.. ఆ కుటుంబం ఆత్మ‌హ‌త్య చేసుకుంది..!

Greater Noida | ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (Uttarpradesh) లోని గ్రేటర్‌ నోయిడా (Greater Noida) లో శుక్రవారం రాత్రి నూడుల్స్‌ (Noodles) తిని, టీ (Tea) తాగి పడుకున్న ఐదుగురు కుటుంబసభ్యులు తెల్లారేసరికి మృతిచెందిన సంగ‌తి తెలిసిందే. అయితే నూడుల్స్‌, టీలో క‌ల్తీయే కార‌ణ‌మ‌ని ముందుగా అంతా భావించారు.
Greater Noida | టీ, నూడుల్స్ కార‌ణం కాదు.. ఆ కుటుంబం ఆత్మ‌హ‌త్య చేసుకుంది..!

Greater Noida : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (Uttarpradesh) లోని గ్రేటర్‌ నోయిడా (Greater Noida) లో శుక్రవారం రాత్రి నూడుల్స్‌ (Noodles) తిని, టీ (Tea) తాగి పడుకున్న ఐదుగురు కుటుంబసభ్యులు తెల్లారేసరికి మృతిచెందిన సంగ‌తి తెలిసిందే. అయితే నూడుల్స్‌, టీలో క‌ల్తీయే కార‌ణ‌మ‌ని ముందుగా అంతా భావించారు. కానీ వారి మృతికి నూడుల్స్‌, టీ క‌ల్తీ కార‌ణం కాద‌ని పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. వారు విషం ప్ర‌భావంతో మ‌ర‌ణించిన‌ట్లు పోస్టుమార్టం నివేదిక‌లో వెల్ల‌డైంది.

వారికి ఫుడ్‌ పాయిజనింగ్‌ కాలేదని పోలీసులు తెలిపారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆస్తి వివాదం కారణంగా ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని వెల్లడించారు. ఆత్మహత్యకు ముందు మృతుడు మహేష్ తన ఫోన్‌లో రికార్డ్‌ చేసిన వాయిస్‌ నోట్ ద్వారా ఈ విషయాన్ని గుర్తించామన్నారు. ఆస్తి కోసం ఇద్దరు సోదరీమణులు, బావ తమ కుటుంబాన్ని కొన్నేళ్లుగా వేధిస్తున్నట్లు మహేష్ త‌న వాయిస్‌ నోట్‌లో పేర్కొన్నారు. వారి వేధింపులు తాళలేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పారు.

దాంతో పోలీసులు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఐదుగురు కుటుంబ‌స‌భ్యులు నూడుల్స్‌లో విషం కలుపుకుని తిని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఇంకా దర్యాప్తు కొనసాగుతున్న‌ది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Spirit New Poster | ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్ట‌ర్, రిలీజ్ డేట్ వ‌చ్చేసిందిBigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com