రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) అండర్ గ్రాడ్యుయేట్ (UG) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో 1688 ఖాళీలను నింపనుంది. సికింద్రాబాద్ జోన్లో 72 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
ఖాళీల వివరాలు
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్- 700
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 200
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 600
ట్రైన్స్ క్లర్క్- 188
సికింద్రాబాద్ జోన్లో..
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్- 60
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 3
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 8
ట్రైన్ క్లర్క్- 1
అర్హతలు
గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి (10+2) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులు అర్హులు. చివరి సంవత్సరం పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు అనర్హులు.
వయసు
అభ్యర్థుల వయసు 2027, జనవరి 1 నాటికి 28 నుంచి 30 ఏండ్లలోపు ఉండాలి.

Rrb Ug Posts
ఎంపిక
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT-1, 2), సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు.
CBT-1: ఇది స్క్రీనింగ్ పరీక్ష. ఇది 100 (మ్యాథ్స్- 30, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్- 30, జనరల్ అవేర్నెస్- 40) మార్కులకు ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్‌లో భాగంగా ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు.
CBT-2: ఇది మెయిన్ పరీక్ష. CBT-1లో సాధించిన మార్కుల నార్మలైజ్ ద్వారా అభ్యర్థులను ఈ పరీక్షకు ఎంపిక చేస్తారు. ఈ పరీక్షను 120 (మ్యాథ్స్- 50, రీజనింగ్- 35, జనరల్ అవేర్నెస్- 35) మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో నెగెటివ్ మార్కింగ్‌లో భాగంగా ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కుల కోత విధిస్తారు.
ఫీజు
దరఖాస్తులను ఆన్లైన్లో చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీలకు రూ. 500. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలు, దివ్యాగులు, ట్రాన్స్‌జెండర్, ఈడబ్ల్యూఎస్‌లకు రూ. 250.
సీబీటీ- 1 పరీక్ష రాసిన అభ్యర్థులు అందరికీ బ్యాంక్ చార్జీలు మినహాయించి రూ. 400, రూ. 250 ఫీజు వాపసు ఇస్తారు.
వేతనం
ఎంపికైనవారికి నెలకు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్‌కు రూ. 21,700, అకౌంట్స్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్ క్లర్క్‌లకు రూ. 19,900 జీతం ఇస్తారు.
చివరితేదీ
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. చివరితేదీ నవంబర్ 13. దరఖాస్తు, ఇతర వివరాలకు వెబ్సైట్ https://rrb.indianrailways.gov.in చూడండి.

Apply






