☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్‌ జగన్‌

Y.S. Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో మొదటి ఘట్టం నామినేషన్ల పర్వం ప్రారంభం రోజునే రాష్ట్రంలోని పలు ప్రాంతాల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్‌ జగన్‌

అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ( Local Body Elections ) ఎన్నికల ప్రక్రియలో మొదటి ఘట్టం నామినేషన్ల పర్వం ప్రారంభం రోజునే రాష్ట్రంలోని పలు ప్రాంతాల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. నామినేషన్ల కేంద్రం వద్ద కూటమి, వైసీపీ నాయకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. పుంగనూరులో వైసీపీ( YCP ) , కూటమి శ్రేణుల అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రాగా ఇరువరు దాడులకు దిగారు.

వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ( MP Mithun Reddy ) కాన్వాయ్‌పై రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. నామినేషన్‌ కేంద్రం వద్ద నుంచి మిథున్‌రెడ్డిని పోలీసులు తరలించారు. ఈ ఘటనపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ( YS Jagan ) మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.ఫోన్‌లో మిథున్‌రెడ్డిని పరామర్శించారు. టీడీపీ నాయకులు పోలీసులను వాడుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

ఎన్నికలు సజావుగా జరపాలన్న ఉద్దేశం చంద్రబాబుకు ఏమాత్రం లేదని పేర్కొన్నారు. తీవ్ర ప్రజా వ్యతిరేకత నడుమ ఓడిపోతారనే తెలిసే దాడులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడికే భద్రతా లేని పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయని అన్నారు. దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, కూటమి అన్యాయాలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని వెల్లడించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Jobs | రైల్వేలో 1688 ఎన్‌టీపీసీ అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఖాళీలతో నోటిఫికేషన్‌ విడుదల.. సికింద్రాబాద్‌ జోన్‌లో 72 పోస్టులుFarmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com