IND vs NZ: న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం జట్లను ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా నవంబర్ 4 నుంచి వన్డే సిరీస్, నవంబర్ 19 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానున్నాయి.
Read also: Aryaveer Sehwag: తండ్రికి తగ్గ తనయుడు.. 143 బంతుల్లో 173 పరుగులు చేసిన సెహ్వాగ్ కొడుకు!
వన్డేల్లో ఇద్దరు కెప్టెన్లు!
అయితే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వర్క్‌లోడ్ మేనెజ్మెంట్లో భాగంగా సెలక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. చివరి రెండు వన్డేలకు గిల్‌కు విశ్రాంతి ఇచ్చారు. తొలి 3 వన్డేల్లో శుభ్‌మన్ గిల్ జట్టుకు నాయకత్వం వహించనుండగా.. చివరి రెండు వన్డేల్లో శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. టెస్టులు, టీ20లకు గుడ్‌బై చెప్పిన మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఐదు వన్డేల సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండటం విశేషం.

యువ ఆటగాడికి ఛాన్స్
యంగ్ వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుశాగ్రా చివరి రెండు వన్డేల కోసం తొలిసారిగా భారత జట్టు పిలుపునందుకున్నాడు. యువ పేసర్ అన్షుల్ కంబోజ్ తొలి మూడు వన్డేల జట్టుకు ఎంపికయ్యాడు. ప్రసిద్ధ్ కృష్ణ ఎంపిక ఫిట్నెస్ ఆధారంగా ఖరారవుతుంది.
ఆకాశ్ దీప్ రీఎంట్రీ
బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ తిరిగి టెస్టు జట్టులోకి వచ్చాడు. కాగా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా వన్డేలకు దూరంగా ఉంటూ కేవలం టెస్టు సిరీస్‌లో మాత్రమే బరిలోకి దిగనున్నాడు. మరోవైపు రిషబ్ పంత్ అందుబాటుపై కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
జట్ల వివరాలు:
తొలి మూడు వన్డేలకు భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ*, కుల్దీప్ యాదవ్.
నాలుగు, ఐదు వన్డేలకు భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్, వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, నమన్ ధీర్, ఔకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, కుమార్ కుశాగ్రా (వికెట్ కీపర్), మహమ్మద్ సిరాజ్, యశ్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్.
టెస్ట్ జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్)*, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అన్షుల్ కాంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, సాయి సుదర్శన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com






