kavya maran-anirudh: ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈవో కావ్య మారన్ వివాహ వేడుకకు సంబంధించి ప్రముఖులకు ఆహ్వానాలు అందజేసే కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగానే కళానిధి మారన్ దంపతులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
Read also: Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నిర్మాత దిల్‌రాజు బృందం
ఆహ్వాన పత్రిక అందజేత
శుక్రవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో కళానిధి మారన్, ఆయన సతీమణి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులను కలిశారు. నవంబర్ 21న చెన్నైలో జరగనున్న తమ కుమార్తె కావ్యా మారన్ – అనిరుధ్ రవిచందర్ వివాహ రిసెప్షన్‌కు హాజరుకావాల్సిందిగా కోరుతూ సీఎం దంపతులకు స్వయంగా ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ విషయాన్ని తెలంగాణ సీఎంఓ ఎక్స్ వేదికగా అధికారికంగా వెల్లడించింది. అలాగే ఇదే పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కూడా మారన్ దంపతులు కలిసి రిసెప్షన్‌కు ఆహ్వానించారు.
నవంబర్ 11న గ్రీస్‌లో పెళ్లి.. 21న చెన్నైలో రిసెప్షన్
అనిరుధ్, కావ్య మారన్ వివాహం నవంబర్ 11న గ్రీస్‌లో అత్యంత వైభవంగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ తర్వాత, నవంబర్ 21న చెన్నైలో అత్యంత గ్రాండ్‌గా రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖ దిగ్గజాలు హాజరుకానున్నట్లు సమాచారం.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com






