☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

జ్యోతిష్యం : అక్టోబర్ నెలలో మేష రాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది.. మూడు గ్రహాల మార్పుతో ఏం జరగబోతుంది

జ్యోతిష్యం : అక్టోబర్ నెలలో మేష రాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది.. మూడు గ్రహాల మార్పుతో ఏం జరగబోతుంది
జ్యోతిష్యం : అక్టోబర్ నెలలో మేష రాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది.. మూడు గ్రహాల మార్పుతో ఏం జరగబోతుంది
జ్యోతిష్యం : అక్టోబర్ నెలలో మేష రాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది.. మూడు గ్రహాల మార్పుతో ఏం జరగబోతుంది

మరో మూడు నెలల్లో 2026 వ సంవత్సరం కాల గర్భంలో కలిసిపోనుంది. అక్టోబర్​ నెల ప్రారంభం కాబోతుంది.అక్టోబర్ మాసంలో అనేక పండుగలు ప్రారంభం కావడంతో చాలా గ్రహాలు కూడా తమ స్థానాలను మార్చుకుంటాయి. 2026 అక్టోబర్ లో గ్రహాలు, నక్షత్రాలు సంచారంలో అనేక మార్పులు జరుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కీలక గ్రహాల మార్పు వలన 2026 అక్టోబర్​ నెల మేషరాశి వారికి ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం...!

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ నెలలో ( 2026 అక్టోబర్)​ శుక్రుడు.. సూర్యుడు..బుధుడు గ్రహాల సంచారంలో జరిగే మార్పుల వలన లక్ష్మీనారాయణ యోగం, మాళవ్య యోగం, బుధాదిత్యయోగం ఏర్పడనున్నాయి. వీటితో పాటు త్రిగ్రాహి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు

అక్టోబర్​లో గ్రహాల స్థాన చలనం మార్పుల వివరాలు

  • అక్టోబర్ 3: తులారాశిలో శుక్రుడు వక్రగతి సంచారం
  • అక్టోబర్ 17: తులారాశిలోకి సూర్యుడు
  • అక్టోబర్ 24: తులారాశిలో బుధుడు వక్రగతి సంచారం
  • అక్టోబర్ 31: సింహరాశిలోకి గురుడు

గ్రహాల సంచారం ఆధారంగా మేష రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. పోటీ రంగాలలో విజయం లభించినప్పటికీ, ఆర్థికంగా, వృత్తిపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. .

మేష రాశికి అధిపతి కుజుడు.. అక్టోబర్ నెలలో పెద్ద మార్పులను ఆశించవచ్చు. కొత్త అవకాశాలు, కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. పని, వృత్తిపై దృష్టి పెట్టడానికి ఇది మంచి సమయమని పండితులు చెబుతున్నారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనేక అవకాశాలు లభిస్తాయి. ఈ నెలలో డబ్బుతో పాటు మీరు విజయం, కీర్తిని కూడా పొందవచ్చు. చిరకాల కోరికలు కూడా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.

అక్టోబర్ 17వ తేదీన ఆరోగ్యం విషయంలో ఒక కీలక పరిణామం జరిగే అవకాశం ఉంది. సూర్యుడు 7వ ఇంటికి మారడం.. శుక్ర, బుధ గ్రహాల తిరోగమనం వలన ప్రతి పని విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. . గురుడు సింహరాశిలోకి ప్రవేశించడం వలన కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అంతే కాకుండా ఉద్యోగంలో ఉన్న వారు ప్రమోషన్స్ అందుకునే ఛాన్స్ ఉంది. అన్ని విధాలుగా వీరికి ఇది చాలా ప్రయోజనకరమైన సమయం అని చెప్పాలి. దాంపత్య జీవితం సాధారణంగా ఉంటుంది. చివరి 15 రోజులు అనవసరంగా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ప్రేమికుల విషయంలో చిన్న చిన్న అపార్థాలు రాకుండా సంభాషణ కొనసాగించండి.

పరిహారాలు

సూర్యోదయ సమయంలో సూర్యభగవానుడి నీళ్లను సమర్పించంది
( దోసెలలో నీళ్లను తీసుకొని సూర్యుడికి చూపించి ఓం సూర్యాయనమ: అంటూ ఒక ప్లేట్లో పోయాలి. ఇలా మూడు సార్లు చేయాలి. ఆ తరువాత ఆ నీటిని చెట్టు మొదట్లో పోయాలి)
ప్రతి రోజూ హనుమాన్ చాలీసా పఠించడం
ప్రతి సోమవారంపేదలకు పాలు.. బియ్యం దానం చేయండి..
శివాలయంలో నువ్వులనూనెతో దీపారాధన చేయండి
ప్రతిరోజూ 11 నిమిషాలు కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← పేషెంట్ లా వెళ్లి ..ముగ్గురు నకిలీ డాక్టర్లను అరెస్ట్ చేసిన పోలీసులురివర్స్ గేర్ వేసిన గోల్డ్ రేట్లు.. హైదరాబాదులో గ్రాము బంగారం ఎంతంటే? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com