☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Pedestrian Safety | పాదచారులు చనిపోతే కాంట్రాక్టర్లే బాధ్యులు.. నాసిరకం రోడ్లపై ఒడిశా సర్కార్‌ ముసాయిదా నిబంధనలు!

Pedestrian Safety | తప్పుడు డిజైన్లు, నాసిరకం నిర్మాణం, సరైన నిర్వహణ లేక రోడ్డు ప్రమాదాల్లో పాదచారులు చనిపోయినా లేదా గాయపడినా అందుకు ఆ రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్లు, ప్రభుత్వ ఇంజినీర్లు, నిర్మాణ సంస్థలపై నేరాభియోగాలను నమోదు చేసి, జరిమానాలు విధించాలని ఒడిశా ప్రభుత్వం యోచిస్తున్నది.
Pedestrian Safety | పాదచారులు చనిపోతే కాంట్రాక్టర్లే బాధ్యులు.. నాసిరకం రోడ్లపై ఒడిశా సర్కార్‌ ముసాయిదా నిబంధనలు!

Pedestrian Safety | భువనేశ్వర్‌: తప్పుడు డిజైన్లు, నాసిరకం నిర్మాణం, సరైన నిర్వహణ లేక రోడ్డు ప్రమాదాల్లో పాదచారులు చనిపోయినా లేదా గాయపడినా అందుకు ఆ రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్లు, ప్రభుత్వ ఇంజినీర్లు, నిర్మాణ సంస్థలపై నేరాభియోగాలను నమోదు చేసి, జరిమానాలు విధించాలని ఒడిశా ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ మేరకు పాదచారుల భద్రత నిబంధనల ముసాయిదాను ఈ నెల 24న విడుదల చేసింది. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం.. మోటర్‌ వాహనాల చట్టంలోని సెక్షన్‌ 198ఏ ప్రకారం ఈ తరహా ఘటనల్లో కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది.

దీంతో పాటు నిర్మాణ సంస్థలను ఒప్పందాల నుంచి తొలగించడం, బ్లాక్‌ లిస్టులో పెట్టడం, చెల్లింపులను నిలిపేయడం చేస్తారు. రోడ్డు ప్రాజెక్ట్‌కు తుది అనుమతి లేదా తుది ఆర్థిక చెల్లింపు జరిగే ముందు, ప్రధాన ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు వ్యక్తిగత చట్టపరమైన బాధ్యతను అంగీకరిస్తూ భద్రత సమ్మతి ప్రకటనపై తప్పనిసరిగా సంతకం చేయాలి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← The Paradise | నెగెటివ్ టాక్ ఉన్నా తగ్గని ‘ది ప్యారడైజ్’ జోరు.. రెండో రోజూ రూ.20 కోట్లకు పైగా గ్రాస్!Revanth Reddy | 78వసారి ఢిల్లీకి రేవంత్‌రెడ్డి.. ఓట్‌ చోరీ అంశంపై చర్చ కోసం ఈనెల29న పయనం! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com