☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

OTT Movies | ఓటీటీలో ఈ శుక్రవారం సంద‌డే సందడి.. ఒకే రోజు 4 దక్షిణాది సినిమాలు, ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ మూవీ ?

OTT Movies | ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు శుక్రవారం మంచి వినోదాన్ని అందించబోతోంది. సెప్టెంబర్ 25న ఒకే రోజు నాలుగు దక్షిణాది సినిమాలు వివిధ ఓటీటీ వేదికలపై స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి. భయానక కథలు, క్రీడా నేపథ్యంలోని పోరాటం, ప్రేమకథ, కుటుంబ భావోద్వేగాలతో కూడిన ఉత్కంఠభరిత కథ.. ఇలా విభిన్న కథాంశాలతో తెరకెక్కిన ఈ నాలుగు చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.
OTT Movies | ఓటీటీలో ఈ శుక్రవారం సంద‌డే సందడి.. ఒకే రోజు 4 దక్షిణాది సినిమాలు, ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ మూవీ ?

OTT Movies | ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు శుక్రవారం మంచి వినోదాన్ని అందించబోతోంది. సెప్టెంబర్ 25న ఒకే రోజు నాలుగు దక్షిణాది సినిమాలు వివిధ ఓటీటీ వేదికలపై స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి. భయానక కథలు, క్రీడా నేపథ్యంలోని పోరాటం, ప్రేమకథ, కుటుంబ భావోద్వేగాలతో కూడిన ఉత్కంఠభరిత కథ.. ఇలా విభిన్న కథాంశాలతో తెరకెక్కిన ఈ నాలుగు చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. వారాంతంలో థియేటర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే సినిమా చూడాలనుకునే వారికి ఈ చిత్రాలు మరో ఎంపికగా నిలవనున్నాయి. దర్శకుడు ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ ‘అగధ’. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయకుమార్, శ్రేయా రాణి రెడ్డి, భాను చందర్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం జీ5 వేదికగా సెప్టెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

తేన్పదియన్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ స్పోర్ట్స్ డ్రామా ‘అంగీకారం’ కూడా సెప్టెంబర్ 25 నుంచే సన్‌నెక్స్ట్‌లో అందుబాటులోకి రానుంది. కోటపాడి జె. రాజేష్, సింధూరి విశ్వనాథ్, విజి వెంకటేష్, రంగరాజ్ పాండే, మన్సూర్ అలీ ఖాన్, రామా రాజేంద్రన్ తదితరులు నటించారు. ఇక మీరా కతీరవన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ భావోద్వేగ చిత్రం ‘హబీబి’. కస్తూరి రాజా, ఈషా ఎం., మాళవిక మనోజ్, ధనశ్రీ సుధాకరన్, అరుళ్ కుమార్, అనుస్రేయ రాజన్ తదితరులు ఇందులో నటించారు. ఈ సినిమా సోనీలివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తిరునెల్వేలి సమీపంలోని ఓ చేనేత కార్మికుల పట్టణం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. దాదాపు 40 ఏళ్ల కాలాన్ని కథలో ఆవిష్కరిస్తూ.. కుటుంబ సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి ఓ వ్యక్తి చేసే ప్రయత్నాన్ని, మరోవైపు అబూ తాహిర్, నీలోఫర్ మధ్య చిగురించే ప్రేమకథను సమాంతరంగా చూపించినట్లు తెలుస్తోంది.

కన్నడలో తెరకెక్కిన సస్పెన్స్, కుటుంబ భావోద్వేగాల చిత్రం ‘మాంగో పచ్చా’ కూడా సెప్టెంబర్ 25 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. వివేకా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంచిత్ సంజీవ్, కాజల్ కుందర్, మయూర్ పటేల్, ప్రశాంత్ హిరేమఠ్, ఉగ్రం మంజు, హంస నారాయణస్వామి తదితరులు నటించారు. మొత్తంగా సెప్టెంబర్ 25న ఓటీటీలోకి వస్తున్న ఈ నాలుగు సినిమాలు నాలుగు విభిన్నమైన కథాంశాలతో రూపొందాయి. హారర్, క్రీడా నేపథ్యం, ప్రేమ, కుటుంబ సస్పెన్స్ వంటి విభిన్న జానర్లలో సినిమాలు ఉండటంతో.. తమకు నచ్చిన కథను ఎంచుకుని ఈ వారాంతాన్ని ఓటీటీలో ఆస్వాదించవచ్చు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Road accident | ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 9 మంది స‌జీవ ద‌హ‌నంThe Paradise Review | ‘ది ప్యారడైజ్’ సినిమా రివ్యూ.. జడల్‌తో నాని బ్లాక్‌బస్టర్ కొట్టాడా? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com