☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

పద్మశ్రీ గ్రహీత సునీతా కృష్ణన్ ఓటు తిరస్కరణ.. SIR ప్రక్రియపై విమర్శలు

పద్మశ్రీ గ్రహీత సునీతా కృష్ణన్ ఓటు తిరస్కరణ.. SIR ప్రక్రియపై విమర్శలు Caption of Image. పద్మశ్రీ అవార్డు గ్రహీత, సోషల్ యాక్టివిస్ట్ సునీతా కృష్ణన్ ఓటు తిరస్కరణకు గురికావడం చర్చనీయాంశంగా మారింది. 2026 అక్టోబర్ 9వ తేదీన ఆమెకు ఓటు ఎన్యూమరేషన్ రిజెక్ట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఫామ్ xxxxxx రిజెక్ట్ అయ్యింది అని ఎన్నికల సంఘం నుంచి మెస్సేజ్ వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.దీనికి సంబంధించిన ఎలాంటి కారణాలను ఎన్నికల సంఘం తెలుపలేదని అన్నారు. అయితే సునీతా కృష్ణన్ ఎన్యూమరేషన్ ఫామ్ తిరస్కరణకు కారణం.. సర్ ప్రక్రియలో భాగంగా ఆమె ఎన్యూమరేషన్ ఫామ్ రిజెక్ట్ అయినట్లు తెలిపారు. 2002లో జరిగిన సర్ ప్రక్రియ సందర్భంగా ఆమె తన తల్లిదండ్రుల వివరాలను మ్యాపింగ్ చేయలేకపోయారని అందుకే రిజెక్ట్ అయినట్లు తెలిపారు. బూత్ లెవెల్ ఆఫీ
పద్మశ్రీ గ్రహీత సునీతా కృష్ణన్ ఓటు తిరస్కరణ.. SIR ప్రక్రియపై విమర్శలు
పద్మశ్రీ గ్రహీత సునీతా కృష్ణన్ ఓటు తిరస్కరణ.. SIR ప్రక్రియపై విమర్శలు

పద్మశ్రీ అవార్డు గ్రహీత, సోషల్ యాక్టివిస్ట్ సునీతా కృష్ణన్ ఓటు తిరస్కరణకు గురికావడం చర్చనీయాంశంగా మారింది. 2026 అక్టోబర్ 9వ తేదీన ఆమెకు ఓటు ఎన్యూమరేషన్ రిజెక్ట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఫామ్ xxxxxx రిజెక్ట్ అయ్యింది అని ఎన్నికల సంఘం నుంచి మెస్సేజ్ వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.దీనికి సంబంధించిన ఎలాంటి కారణాలను ఎన్నికల సంఘం తెలుపలేదని అన్నారు.

అయితే సునీతా కృష్ణన్ ఎన్యూమరేషన్ ఫామ్ తిరస్కరణకు కారణం.. సర్ ప్రక్రియలో భాగంగా ఆమె ఎన్యూమరేషన్ ఫామ్ రిజెక్ట్ అయినట్లు తెలిపారు. 2002లో జరిగిన సర్ ప్రక్రియ సందర్భంగా ఆమె తన తల్లిదండ్రుల వివరాలను మ్యాపింగ్ చేయలేకపోయారని అందుకే రిజెక్ట్ అయినట్లు తెలిపారు.

బూత్ లెవెల్ ఆఫీసర్ వివరణపై సునీతా కృష్ణన్ స్పందించారు. 2002లో తనంతనట తాను ఓటు రిజిస్టర్ చేసుకోలేదని ఆమె చెప్పారు.

అయితే సర్ ప్రక్రియలో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ లో రెండు సెక్షన్లు ఉన్నాయి. ఒకటి 2002లో ఓటర్లు గా ఉన్నవారికోసం కాగా .. మరొకటి ఆ ఏడాదిలో మైనర్లుగా ఉన్న వారి ఓటు నమోదు సమయంలో తల్లిదండ్రుల వివరాలు ఇవ్వడం. చిన్న వయసులోనే ఇంటి నుంచి వెళ్లిపోవడంతో.. కుటుంబ సభ్యులతో తక్కువ సంబంధాలు ఉండటంతో ఆ సమయంలో పేరెంట్స్ డీటైల్స్ ఇవ్వలేకపోయినట్లు చెప్పారు.

అయితే మూడేళ్ల క్రితం తన భర్తతో కలిసి ఓటు రిజిస్టర్ చేసుకున్నట్లు చెప్పారు. అయితే ఆమె భర్త ఫామ్ కూడా రిజెక్ట్ అయినట్లు చెప్పారు.

గత కొన్నేళ్లుగా నేను ఓటర్ ఐడీ కార్డులను తీసుకోవడం మానేశాను. దీనికి కారణం ఇక్కడున్న రాజకీయ పార్టీలు. ఒకవేళ కార్డున్నా.. నేను నోటాకే ఓటు వేసేదాన్ని. పద్మశ్రీ అవార్డు గ్రహీత ఓటు వేయకపోవడం అవమానకరమైన విషయమే.. కానీ ఇక్కడున్న పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు నా విషయమే ఒక ఉదాహరణ అంటూ పేర్కొన్నారు. ఈ దంపతులు 2024లో తొలిసారి ఓటు వేశారు.

ప్రస్తుత SIR ప్రక్రియలో భాగంగా, ఫామ్ లను పంపిణీ చేయడానికి లేదా సేకరించడానికి ఏ BLO (బూత్ స్థాయి అధికారి) వారి ఇంటికి రాకపోవడంతో, తమ వివరాల నమోదు ఫారమ్‌లను ఆన్‌లైన్‌లో సమర్పించారు. అయితే తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి 12 ప్రూఫ్ లలో ఏదైనా ఒకదానిని సమర్పించమని కోరుతూ, SIR అందించే నోటీసులు తమకు శ్రీమతి కృష్ణన్ తెలిపారు.

ఇప్పుడు, క్లెయిమ్‌లు, అభ్యంతరాలను దాఖలు చేసే గడువు ముగియడంతో, తుది జాబితాలో తిరిగి నమోదు కోసం ఫామ్ 6ను సమర్పించే అవకాశాన్ని ఆ దంపతులు కోల్పోయారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← ఇక వెండి రేట్లు పెరగవా? ఆల్ టైమ్ హై నుంచి 50% ఎందుకు పడింది: అసలేం జరుగుతోంది?ఢిల్లీ సరిహద్దుల్లో వేల సంఖ్యలో కాక్రోచ్లు.. పోలీసుల నిర్బంధంతో జనసంద్రంలా రోడ్లు, హైవేలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com