☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Sharjah | భారతీయ సిబ్బంది ఉన్న చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. అందరూ సురక్షితం

Sharjah : షార్జా తీరంలో పనామాకు చెందిన ఒక క్రూడాయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో నౌకలో ఉన్న 22 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
Sharjah | భారతీయ సిబ్బంది ఉన్న చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. అందరూ సురక్షితం

Sharjah : షార్జా తీరంలో పనామాకు చెందిన ఒక క్రూడాయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో నౌకలో ఉన్న 22 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. ఎంటీ జీఈఎం నెం.2 అనే చమురు ట్యాంకర్ యూఏఈ, షార్జా తీరంలో లంగరు వేసే ప్రాంతంలో ఉంది. ఈ నౌకలో 22 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. అక్టోబర్ 9న ఈ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి జరిగింది.

అయితే, ఈ దాడి ఘటనలో 22 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఎవరికీ, ఎలాంటి హానీ కలగలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ అంశంపై షిప్ మేనేజ్‌మెంట్ సంస్థను సంప్రదిస్తున్నామని, భారతీయ సిబ్బంది క్షేమం కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని సోనోవాల్ వివరించారు. ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఘటన జరిగిన ప్రాంతం యూఏఈ, దుబాయ్‌, అరేబియన్ గల్ఫ్ తీరంలో ఉంది. ఈ డ్రోన్ దాడిని ఇండియా, లైబీరియా ఖండించాయి. నల్ల సముద్రంలో వాణిజ్య నౌకలు, నావికా సిబ్బందిపై దాడి జరగడాన్ని తప్పుబట్టాయి.

సముద్ర నౌకల రవాణా, సిబ్బంది భద్రత కోసం అంతర్జాతీయంగా సహకారం, సమన్వయం అవసరం అని ఇండియా, లైబీరియా అభిప్రాయపడ్డాయి. ఈ అంశంపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ స్పందించారు. సముద్రంలో వ్యాపారం, వాణిజ్యం నిర్వహించే దేశాలు, నౌక రవాణా దేశాలు, సిబ్బంది ఉన్న దేశాలు కలిసి ఏర్పడ్డ జీఓఎఫ్ ఆన్ ఎస్4 (గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ సీఫేరర్స్‌) కలిసి నౌకలు, సిబ్బంది రక్షణ కోసం తగిన చర్యలు, ప్రణాళికలు రూపొందించాలని కోరారు. ఇప్పటికే ఈ గ్రూపు తొలి మీటింగ్ న్యూయార్క్‌లో జరగగా.. 25 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నాన‌మ్మ మృతి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com