☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

మాకు ఆ సీట్లు కావాల్సిందే అంటున్న పవన్..?

ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి ముసుగులో ఉన్న పార్టీల మధ్య అసలు రంగు బయటపడుతోంది. అధికారం పంచుకోవడంలో ఉన్న తాపత్రయం, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారంలో కనిపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్న వేళ.. రాబోయే మున్సిపల్ ఎన్నికల సీట్ల సర్దుబాటు వ్యవహారం కూటమిలో పెద్ద చిచ్చుకు దారితీసేలా కనిపిస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన భేటీలో సీట్ల లొల్లి పతాక స్థాయికి చేరినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. […] The post మాకు ఆ సీట్లు కావాల్సిందే అంటున్న పవన్..? appeared first on Telugu Rajyam.
మాకు ఆ సీట్లు కావాల్సిందే అంటున్న పవన్..?

ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి ముసుగులో ఉన్న పార్టీల మధ్య అసలు రంగు బయటపడుతోంది. అధికారం పంచుకోవడంలో ఉన్న తాపత్రయం, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారంలో కనిపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్న వేళ.. రాబోయే మున్సిపల్ ఎన్నికల సీట్ల సర్దుబాటు వ్యవహారం కూటమిలో పెద్ద చిచ్చుకు దారితీసేలా కనిపిస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన భేటీలో సీట్ల లొల్లి పతాక స్థాయికి చేరినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలనుకుంటున్న స్థానాల జాబితాను పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముందు పెట్టడమే కాకుండా.. టీడీపీకి బలమైన పట్టున్న కీలక స్థానాల కోసం గట్టిగా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు వల్ల తామే ఎక్కువ లాభపడ్డామనే అహంకారంతో ఉన్న జనసేన శ్రేణులు, ఇప్పుడు మున్సిపల్ చైర్మన్, మేయర్ పీఠాలపై కన్నేశాయి. నామమాత్రపు స్థానాలతో తాము సర్దుకుపోయే ప్రసక్తే లేదని, గత ముప్పై ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉన్న బలమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను తమకే కేటాయించాలంటూ పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై తీవ్రమైన పొలిటికల్ ప్రెజర్ పెంచుతున్నారు.

జనసేనాని పెట్టిన ఈ డిమాండ్లతో టీడీపీ హైకమాండ్ ప్రస్తుతం తీవ్ర గందరగోళంలో మునిగిపోయింది. సొంత నియోజకవర్గాల్లో మిత్రపక్షాల కోసం సీట్లు వదులుకుంటే స్థానికంగా టీడీపీ కేడర్ తిరుగుబాటు చేయడం ఖాయమని చంద్రబాబు టెన్షన్ పడుతున్నారు. ఈ ముఠా తగాదాలు మరియు సీట్ల గొడవలను ఎలాగోలా చల్లార్చడానికి చంద్రబాబు నాయుడు ఒక రక్షణ వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. కూటమి సమన్వయ కమిటీలో కేవలం జనసేన మాత్రమే కాదు, బీజేపీ ప్రతినిధుల నుంచి కూడా వారు పోటీ చేయాలనుకుంటున్న స్థానాల లిస్ట్‌ను ముందే లాగేయాలని టీడీపీ హైకమాండ్‌కు ఆదేశాలు ఇచ్చారు.

మిత్రపక్షాలు అడిగిన ప్రతి సీటును గుడ్డిగా ఇచ్చేసే ప్రసక్తే లేదని, ఎక్కడైతే జనసేన, బీజేపీలకు కచ్చితమైన గ్రౌండ్ బలం ఉందో ఆ వివరాలు మాత్రమే ముందుగా ఇవ్వాలని టీడీపీ కండిషన్లు పెడుతోంది. అంటే ఒకరినొకరు నమ్మలేని స్థితికి కూటమి పార్టీలు చేరుకున్నాయని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టేసి, ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాకముందే మేయర్ పీఠాలు, చైర్మన్ పదవుల కోసం కూటమి నేతలు ఇలా ఢీ అంటే ఢీ అనుకోవడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పవన్ కళ్యాణ్ తన మొండి పట్టుదలతో టీడీపీకి పట్టున్న స్థానాలను లాక్కోవాలని చూడటం, దాన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు ఎత్తులకు పైఎత్తులు వేయడం చూస్తుంటే.. ఈ మున్సిపల్ ఎన్నికల సీట్ల లొల్లి కూటమి పతనానికి నాంది పలకబోతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

The post మాకు ఆ సీట్లు కావాల్సిందే అంటున్న పవన్..? appeared first on Telugu Rajyam.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఏపీలో రేపే స్థానిక సమరం షెడ్యూల్..?స్థానిక పోరులో తొలి అభ్యర్థిని ప్రకటించిన జగన్..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com