☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
రోజుకో చిలగడదుంప తినండి - బీపీ, షుగర్ కంట్రోల్.. గుండె సేఫ్..!! • మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లకి లివర్ ప్రాబ్లమ్ ముప్పు ఎక్కువో తెలుసా? • ఒమేగా 3 పుష్కలంగా ఉండే అవిసె గింజల లడ్డూ.. చలికాలంలో రోజుకొకటి తింటే ఆశ్చర్యపరిచే ఆరోగ్య ప్రయోజనాలు • ఓడియమ్మ: బాత్రూమ్‌ లో భారీ కొండచిలువ ఫొటో.. నిజమని నమ్మి 48 గంటలు గాలించారు, చివరికి చూస్తే.. • Moral stories: విడిపోతామన్న కుమారులు.. తండ్రి పెట్టిన పరీక్ష ఇదే.. 'పగిలిన పళ్లెం' కథ తెలుసా..? • చిటికెలో నోరూరించే ఉల్లిపాయ కుర్మా.. ఈ రుచికి ఇంట్లో వాళ్ళు రెండు ఇడ్లీలు ఎక్కువే తింటారు! • ఈ నెలాఖరుకు గజకేసరి రాజయోగం.. వీరి పంట పండినట్టే! • కార్తీక పౌర్ణమి శివయోగంతో ఈ రాశులవారి జీవితంలో నేడు మహాద్భుతం! •

PM Kisan 24th Instalment Date : రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ నిధుల విడుదలపై క్లారిటీ.. బ్యాంక్ ఖాతాల్లోకి జమయ్యేది ఆరోజే..

PM Kisan 24th Instalment Date : ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6,000 ఆర్థిక సాయంను కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే.
PM Kisan 24th Instalment Date : రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ నిధుల విడుదలపై క్లారిటీ.. బ్యాంక్ ఖాతాల్లోకి జమయ్యేది ఆరోజే..

PM Kisan 24th Instalment Date : దేశవ్యాప్తంగా పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం లబ్ధిదారులుగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం వెల్లడించింది. ఈ పథకం కింద అందించే 24వ విడత నిధులను అక్టోబర్‌ 30న విడుదల చేయనున్నారు. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున నేరుగా జమ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వ అధికారిక ప్రకటన ప్రకారం, ఈ విడత ద్వారా సుమారు 9.34 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం అందించనున్నారు.

Also Read : CM Chandrababu Naidu : తెలంగాణ మంత్రి సీతక్కపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర కామెంట్స్..

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6,000 ఆర్థిక సాయంను కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని నాలుగు నెలలకోసారి రూ.2,000 చొప్పున మూడు విడతల్లో నేరుగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. 23వ విడత నిధులను ఈ ఏడాది జూన్‌ 20న విడుదల చేశారు. ఇప్పుడు 24వ విడత నిధులను అక్టోబర్‌ 30న రైతుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం జమచేయనుంది.

నిధులు రావాలంటే ఇలా చేయాలి..
♦ పీఎం కిసాన్ పథకం కింద రూ.2,000 సకాలంలో అందాలంటే రైతులు తమ వివరాలను ముందుగానే తనిఖీ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ అంశాలపై దృష్టి పెట్టాలి.
♦ ఈ-కేవైసీ: పీఎం కిసాన్‌ పథకంలో ఈ-కేవైసీ తప్పనిసరి.
♦ ఆధార్‌ అనుసంధానం: బ్యాంకు ఖాతా, ఆధార్‌ వివరాలు సరిగ్గా ఉన్నాయో చూసుకోవాలి.
♦ భూమి వివరాల ధ్రువీకరణ: భూ రికార్డుల పరిశీలన పూర్తయిందో లేదో నిర్ధారించుకోవాలి.
♦ బ్యాంకు ఖాతా వివరాలు: ఖాతా చెల్లుబాటులో ఉండటంతో పాటు డబ్బు జమ కావడానికి అవసరమైన అనుసంధానాలు పూర్తయి ఉండాలి.
♦ లబ్ధిదారుల స్థితి: పథకానికి అర్హత, చెల్లింపు వివరాలను అధికారిక పోర్టల్‌లో తనిఖీ చేయాలి.

మీ ఖాతాలో డబ్బులు పడతాయో లేదో ఇలా తెలుసుకోండి..
♦ రైతులు పీఎం కిసాన్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తమ లబ్ధిదారుల స్థితిని తెలుసుకోవచ్చు.
♦ pmkisan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
♦ Farmers Corner విభాగంలో Know Your Status ఎంపికను ఎంచుకోండి.
♦ మీ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను నమోదు చేయండి.
♦ క్యాప్చా, ఓటీపీ వంటి ధ్రువీకరణ వివరాలను పూర్తి చేయండి.
♦ మీ చెల్లింపు స్థితి, ఈ-కేవైసీ వివరాలను పరిశీలించండి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← IND vs NZ : చెల‌రేగిన డారిల్ మిచెల్‌.. భార‌త్ ముందు భారీ ల‌క్ష్యంCM Chandrababu Naidu : తెలంగాణ మంత్రి సీతక్కపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర కామెంట్స్.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com