☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని

Kolkata stampede : కోల్‌కతా తొక్కిసలాట ఘటనలో 19 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్రపతి అన్నారు.
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని

Kolkata stampede : కోల్‌కతా తొక్కిసలాట ఘటనలో 19 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్రపతి అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆదివారం ప్రకటన చేశారు. మరోవైపు ప్రధాని మోదీ కూడా తొక్కిసలాట ఘటనపై స్పందించారు.

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. అలాగే, గాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సాయం ప్రకటించారు. తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందిస్తామని మోదీ ప్రకటించారు. ఈ ఘటనపై బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.

అయితే, దుర్గా మండపం దగ్గర నిర్వహణా లోపమే తొక్కిసలాటకు కారణమని టీఎంసీ ఆరోపించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయలేదని విమర్శించింది. మండపం దగ్గర పోలీసులు, తగినంత భద్రత కూడా ఏర్పాటు చేయలేదని టీఎంసీ ఆరోపించింది. ఈ మండపం నిర్వాహకులు సీఎంకు అత్యంత సన్నిహతులు, బంధువులు అని టీఎంసీ తెలిపింది. ఈ పూజా కమిటీకి ఒక బీజేపీ ఎమ్మెల్యేనే ఛైర్మన్‌గా ఉన్నాడని టీఎంసీ ఆరోపించింది. ఇప్పుడు ఈ మృతులకు బాధ్యత ఎవరు తీసుకుంటారు అని టీఎంసీ ప్రశ్నించింది.

అయితే, టీఎంసీ ఆరోపణలపై సీఎం సువేందు అధికారి ఘాటుగా స్పందించారు. గతంలో మమత ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని ప్రస్తావించారు. 2025లో కూడా ఇలాంటి ఘటన జరిగిందని, అప్పుడు 13 మంది మరణించారని గుర్తు చేశారు. అప్పుడు మమతా బెనర్జీ బాధిత కుటుంబాలను కనీసం పరామర్శించారా అంటూ సువేందు ప్రశ్నించారు. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని మండపాల వద్ద భద్రతా తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com