☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే ఛాన్స్ : ఎన్ నినో దరిద్రం పోనుందా..!

బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే ఛాన్స్ : ఎన్ నినో దరిద్రం పోనుందా..! Caption of Image. ఎల్ నినో కరువుతో తెలుగు రాష్ట్రాల్లో నీటి కష్టాలు వచ్చాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ తుఫాన్ ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో తీరం దాటవచ్చని.. ఇదే జరిగితే భారీ వర్షాలతో నీటి కష్టాలు తీరతాయని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ప్రస్తుతం అంటే.. 2026, అక్టోబర్ 21వ తేదీ నాటికి ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంలో.. నైరుతి బంగాళాఖాతంలో.. సముద్ర మట్టానికి ఐదు కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్టోబర్ 24 లేదా 25 తేదీల్లో అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్టోబ
బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే ఛాన్స్ : ఎన్ నినో దరిద్రం పోనుందా..!
బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే ఛాన్స్ : ఎన్ నినో దరిద్రం పోనుందా..!

ఎల్ నినో కరువుతో తెలుగు రాష్ట్రాల్లో నీటి కష్టాలు వచ్చాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ తుఫాన్ ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో తీరం దాటవచ్చని.. ఇదే జరిగితే భారీ వర్షాలతో నీటి కష్టాలు తీరతాయని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ.

ప్రస్తుతం అంటే.. 2026, అక్టోబర్ 21వ తేదీ నాటికి ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంలో.. నైరుతి బంగాళాఖాతంలో.. సముద్ర మట్టానికి ఐదు కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్టోబర్ 24 లేదా 25 తేదీల్లో అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

అక్టోబర్ 27వ తేదీ నాటికి అండమాన్ దగ్గర ఏర్పడే అల్పపీడనం బలపడి.. వాయుగుండంగా మారి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని.. అక్టోబర్ 30వ తేదీ నాటికి ఇది తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వివరిస్తున్నాయి.

అక్టోబర్ 30వ తేదీ నాటికి తుఫాన్ గా మారి.. ఇది కోస్తా ఆంధ్ర నుంచి దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటొచ్చని అంచనా వేస్తుంది వాతావరణ శాఖ. ఇదే జరిగితే ఏపీలోని కోస్తా జిల్లాలు, తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని.. ఎల్ నినో కరువు నుంచి తెలుగు రాష్ట్రాలు బయటపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ నిపుణులు. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనంగా ఉన్న ఇది తుఫాన్ గా మారే అవకాశం ఉందా లేదా.. దీని ప్రభావం ఎంత వరకు ఉంటుంది అనేది ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ క్లారిటీ ఇస్తుంది.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← దసరా తర్వాత బ్రేక్ తీసుకున్న గోల్డ్ అండ్ సిల్వర్.. హైదరాబాదులో రేట్లు ఎంతంటే?ఏపీ ఎన్నికలు : పులివెందులలో వైసీపీ అభ్యర్థుల ఇళ్లపై దాడులు, వాహనాలకు నిప్పు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com