☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

ఏపీ ఎన్నికలు : పులివెందులలో వైసీపీ అభ్యర్థుల ఇళ్లపై దాడులు, వాహనాలకు నిప్పు

ఏపీ ఎన్నికలు : పులివెందులలో వైసీపీ అభ్యర్థుల ఇళ్లపై దాడులు, వాహనాలకు నిప్పు
ఏపీ ఎన్నికలు : పులివెందులలో వైసీపీ అభ్యర్థుల ఇళ్లపై దాడులు, వాహనాలకు నిప్పు
ఏపీ ఎన్నికలు : పులివెందులలో వైసీపీ అభ్యర్థుల ఇళ్లపై దాడులు, వాహనాలకు నిప్పు

ఆంధ్రాలో స్థానిక సంస్థల ఎన్నికల టెన్షన్ ఇంకా తగ్గలేదు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నామినేషన్ల ఉప సంహరణకు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉండటంతో కడప జిల్లా పులివెందులలో హై టెన్షన్ నెలకొంది. నామినేషన్లు వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఇళ్లపై అర్థరాత్రి దాడులు జరిగాయి. 2026, అక్టోబర్ 20వ తేదీ రాత్రి పులివెందులలోని 33, 31వ వార్డుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఇళ్లపై దాడులు జరిగాయి. వాహనాలకు నిప్పు పెట్టారు దుండగులు. విషయం తెలిసిన వెంటనే కడప ఎంపీ, వైసీపీ నేత అవినాష్ రెడ్డి బాధితులను పరామర్శించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి 11 నుంచి 12 గంటల మధ్య లారీలు, బైక్‌లపై పెట్రోల్ పోసి నిప్పంటించారని.. 31వ వార్డు అభ్యర్థి అంజనప్ప ఇంటిపై బీరు సీసాలతో దాడి చేశారంటూ వీడియోలు, ఫొటోలు విడుదల చేశారు. ఈ ఘటనపై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు వైసీపీ అభ్యర్థుల ఆస్తులపై దాడులకు దిగుతున్నారంటూ ఆరోపించారాయన. నామినేషన్ల దశలో పోలీసులను అడ్డుపెట్టుకుని తమ పార్టీ అభ్యర్థులకు ఇబ్బందులు కలిగించారని.. ఇప్పుడు నామినేషన్లు ఆమోదం పొందిన అభ్యర్థుల ఆస్తులపై దాడులు చేయడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్లు రావనే భయంతోనే.. పోలీసులను అడ్డం పెట్టుకుని మా పార్టీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ మండిపడ్డారు ఎంపీ అవినాష్ రెడ్డి. చక్రాయపేట, సింహాద్రిపురం మండలాల్లో జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి.. పోలీసుస్టేషన్లలో నిర్బంధిస్తున్నారంటున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. పులివెందులలో గతంలో సుజాత అక్క చికెన్ సెంటర్, చెరుకు రసం దుకాణంపై జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో కనిపిస్తున్నా.. బాధ్యులపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఆ ఘటనలో సకాలంలో చర్యలు తీసుకుని ఉంటే.. ఇప్పుడు ఈ దాడులు జరిగేవి కావని.. పోలీసుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని విమర్శించారు ఎంపీ అవినాష్ రెడ్డి.

ఈ దాడులపై.. స్పాట్ నుంచే డీఎస్పీ మురళి నాయక్‌కు ఫోన్ చేసి ప్రశ్నించారు ఎంపీ అవినాష్ రెడ్డి. పులివెందులలో జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారాయన. పోలీసు వ్యవస్థ ప్రజలకు జవాబుదారీగా పని చేయాలని.. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న విమర్శలకు తావివ్వకూడదని స్పష్టం చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే ఛాన్స్ : ఎన్ నినో దరిద్రం పోనుందా..!తెలంగాణలో కొత్త పోలీస్ ఉద్యోగాల భర్తీపై సీఎం కీలక ప్రకటన →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com