☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

Regime Change: అధికార మార్పిడి జ‌ర‌గాల‌న్న ప్రశాంత్ భూష‌ణ్.. ఆ వ్యాఖ్య‌ల‌ను వ్య‌తిరేకించిన అభిజీత్ దీప్కే

Regime Change: దేశంలో అధికార మార్పిడి జ‌ర‌గాల‌ని సీనియ‌ర్ న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌ణ్ అన్నారు. ప్ర‌భుత్వం ప‌ట్ల అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌డం ప్ర‌జాస్వామ్యంలో నేరం కాదు అని, ఇప్పుడు పోరాటం అంతా అధికార మార్పిడి కోస‌మే అని ఆయ‌న తెలిపారు. ఆ వ్యాఖ్య‌ల‌ను కాక్రోచ్ జ‌న‌తా పార్టీ నేత అభిజీత్ దీప్కే వ్య‌తిరేకించారు. తాము కేవలం సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొల‌గింపు కోరుతున్న‌ట్లు చెప్పారు.
Regime Change: అధికార మార్పిడి జ‌ర‌గాల‌న్న ప్రశాంత్ భూష‌ణ్.. ఆ వ్యాఖ్య‌ల‌ను వ్య‌తిరేకించిన అభిజీత్ దీప్కే

న్యూఢిల్లీ: చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మీష‌నర్ జ్ఞానేశ్ కుమార్‌ను త‌న ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని సీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ఇత‌ర విప‌క్ష పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో గురువారం జ‌రిగిన మీడియా స‌మావేశంలో ప‌లువురు నేత‌లు మాట్లాడారు. ఆ స‌మ‌యంలో సీనియ‌ర్ న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌ణ్ మాట్లాడుతూ అధికార మార్పిడి కూడా జ‌ర‌గాల‌న్నారు. ఆ స‌మావేశంలో ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేష‌న్ నేత నేహా బోరా, కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఫౌండ‌ర్ అభిజీత్ దీప్కే కూడా పాల్గొన్నారు. ప్ర‌భుత్వం ప‌ట్ల అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌డం ప్ర‌జాస్వామ్యంలో నేరం కాదు అని, ఇప్పుడు పోరాటం అంతా అధికార మార్పిడి కోస‌మే అని ప్ర‌శాంత్ భూష‌ణ్ అన్నారు. అధికార మార్పిడి కోసం విప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయ‌ని ప్ర‌భుత్వం అంటోంద‌ని, కానీ ఎన్నిక‌ల‌ను స‌జావుగా నిర్వ‌హించాల‌ని తాము పోరాటం చేస్తున్నామ‌ని, ఒక‌వేళ ఇదే త‌ర‌హా క్రూర‌త్వం కొన‌సాగితే, అప్పుడు త‌ప్ప‌కుండా అధికార మార్పిడి జ‌రుగుతుంద‌ని, అవును మా అంద‌రికీ ప్ర‌భుత్వం మారాల‌ని ఉంద‌ని ఆయ‌న అన్నారు. అధికార మార్పిడి కోసం బీజేపీ కూడా ఎన్నో ఉద్య‌మాలు చేప‌ట్టింద‌ని, కానీ ఇప్పుడు కుట్ర జరుగుతున్న‌ట్లు ఆ పార్టీ ఆరోపించ‌డం స‌మంజ‌సం కాదు అని ఆయ‌న పేర్కొన్నారు.

మీడియా స‌మావేశంలో ప్ర‌శాంత్ భూష‌ణ్ చేసిన అధికార మార్పిడి వ్యాఖ్య‌ల‌ను కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఫౌండ‌ర్ అభిజీత్ దీప్కే త‌ప్పుప‌ట్టారు. తాము చేస్తున్న నిర‌స‌న‌లు కేవ‌లం సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొల‌గించ‌డం కోస‌మే అని దీప్కే అన్నారు. అధికార‌, ప్ర‌భుత్వ మార్పిడి త‌మ ఉద్దేశం కాదు అని తెలిపారు. అధికార మార్పిడి జ‌ర‌గాల‌ని తాము చెప్ప‌డం లేద‌ని, ఆ దిశ‌గా ప‌నిచేయ‌డం లేద‌ని, సీఈసీ ఎన్నిక‌ల‌ను రిగ్గింగ్ చేస్తున్నార‌ని, త‌న తోటి ఎన్నిక‌ల క‌మీష‌నర్ల‌ను ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, సుప్రీంకోర్టు ఆదేశాల‌ను కూడా విన‌డం లేద‌ని, ప్ర‌స్తుతం సీఈసీని తొల‌గించి, నిష్ప‌క్ష‌పాతంగా కొత్త సీఈసీని నియ‌మించాల‌ని దీప్కే అన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!90 Hours Fasting | 90 గంట‌ల పాటు నిరంత‌రాయంగా ఉప‌వాసం ఉండ‌డం సాధ్య‌మేనా.. డాక్ట‌ర్లు ఏమంటున్నారు..? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com