☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. ముగ్గురి మృతి

వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరి ఘాట్‌ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలోని కేసారం గ్రామానికి చెందిన 54 మంది ఓ అంత్యక్రియల […] The post ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. ముగ్గురి మృతి appeared first on Adya News Telugu.
ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. ముగ్గురి మృతి

వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరి ఘాట్‌ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలోని కేసారం గ్రామానికి చెందిన 54 మంది ఓ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారంతా ప్రైవేటు బస్సులో వికారాబాద్‌ జిల్లా ధరూర్‌ మండలం చింతకుంటకు తిరుగు ప్రయాణమయ్యారు. అనంతగిరి కొండ పైనుంచి కిందకు దిగుతుండగా ఘాట్‌ రోడ్డులోని ఓ మలుపు వద్ద బస్సు అదుపుతప్పింది. రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఒక్కసారిగా బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో తీవ్ర ఆర్తనాదాలు మిన్నంటాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

The post ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. ముగ్గురి మృతి appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఆసియా క్రీడలు.. టీమ్‌ఇండియా ఖాతాలో స్వర్ణంరేణుకాస్వామి హత్య కేసు.. కీలక మలుపులు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com