☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

రేణుకాస్వామి హత్య కేసు.. కీలక మలుపులు

బెంగళూరులో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన ప్రదోశ్‌ రావు కోర్టు ముందు సంచలన వాంగ్మూలం ఇచ్చాడు. ఇందులో ప్రముఖ కన్నడ నటుడు దర్శన్, నటి పవిత్రా గౌడల పాత్రను అతడు వివరంగా బయటపెట్టాడు. మొత్తం 59 పేజీల్లో 100 పేరాల సమాచారాన్ని అతడు దస్త్రాల్లో నమోదు చేయించాడు. ప్రదోశ్‌ వాంగ్మూలం ప్రకారం పట్టణగెరె షెడ్డులో దాడి జరిగిన తర్వాత దర్శన్, పవిత్ర తమ ఇంటికి వెళ్లిపోయారు. […] The post రేణుకాస్వామి హత్య కేసు.. కీలక మలుపులు appeared first on Adya News Telugu.
రేణుకాస్వామి హత్య కేసు.. కీలక మలుపులు

బెంగళూరులో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన ప్రదోశ్‌ రావు కోర్టు ముందు సంచలన వాంగ్మూలం ఇచ్చాడు. ఇందులో ప్రముఖ కన్నడ నటుడు దర్శన్, నటి పవిత్రా గౌడల పాత్రను అతడు వివరంగా బయటపెట్టాడు. మొత్తం 59 పేజీల్లో 100 పేరాల సమాచారాన్ని అతడు దస్త్రాల్లో నమోదు చేయించాడు.

ప్రదోశ్‌ వాంగ్మూలం ప్రకారం పట్టణగెరె షెడ్డులో దాడి జరిగిన తర్వాత దర్శన్, పవిత్ర తమ ఇంటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత రేణుకాస్వామి మృతి చెందిన వార్తను సహ నిందితులు దర్శన్‌కు చేరవేశారు. ఆ సమాచారం వినగానే దర్శన్‌ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. నేరాన్ని ఎవరైనా తమపై వేసుకోకపోతే రివాల్వర్‌తో కాల్చుకుంటానని బెదిరించాడు. లేదా ఉరివేసుకుని చనిపోతానని ఆందోళన వ్యక్తం చేశాడు.

నేరాన్ని తమపై వేసుకునే వారికి భారీగా నగదు ఇచ్చేందుకు దర్శన్ సిద్ధపడ్డాడు. కార్తిక్, నిఖిల్‌ అనే ఇద్దరు యువకులు ఈ నేరాన్ని ఒప్పుకోవడానికి ముందుకొచ్చారు. దీంతో వారికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.10 లక్షల బయానాను దర్శన్ తన నివాసంలోనే ఇచ్చాడు. అలాగే రేణుకాస్వామిని అపహరించిన రాఘవేంద్రకు అదనంగా మరో రూ.5 లక్షలు అందించాడు.

మృతదేహాన్ని పారవేసేందుకు నిందితులు కెంగేరి, నాగరబావి తదితర ప్రాంతాల్లో తిరిగారు. చివరకు మాళగాళలోని రాజకాలువ సమీపంలో మృతదేహాన్ని పడేశారు. లొంగిపోయేందుకు వచ్చిన యువకులకు నిందితులు ఓ కట్టుకథను నేర్పించారు. నగదు లావాదేవీల వల్లే కొట్టామని పోలీసుల ముందు వారు చెప్పారు.

అయితే మర్మావయవాలపై దాడి ఎందుకు జరిగిందనే అంశంపై పోలీసులు ప్రశ్నించగా అసలు గుట్టు రట్టయింది. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో వారు నిజాన్ని వెల్లడించారు. అనంతరం మైసూరులో దర్శన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రదోశ్‌ ఇచ్చిన పూర్తి వాంగ్మూలంతో దర్శన్‌ చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది.

The post రేణుకాస్వామి హత్య కేసు.. కీలక మలుపులు appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. ముగ్గురి మృతిగదికి రప్పించి.. ఆపై కడతేర్చి! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com