☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

KCR | ‘ది ప్యారడైజ్’లో కేసీఆర్.. దద్దరిల్లుతున్న థియేటర్లు!

TheParadise | న్యాచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' (The Paradise) సెప్టెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది.
KCR | ‘ది ప్యారడైజ్’లో కేసీఆర్.. దద్దరిల్లుతున్న థియేటర్లు!

Priyadarshi | న్యాచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise) సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. అయితే ఈ సినిమాకు బుధ‌వారం ప్రీమియ‌ర్‌ల‌ను ప్ర‌ద‌ర్శించ‌గా ఇందులో నటుడు ప్రియదర్శి పోషించిన ‘శంకరన్న’ (ఎమ్మెల్యే శంకరన్న) పాత్ర థియేటర్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ పాత్ర తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను గుర్తుకు తెస్తుండటంతో సోషల్ మీడియాలో ఫుల్ వైర‌ల్‌గా మారింది. ప్రియదర్శి మాట్లాడే తీరు, ఆయన తెలంగాణ యాస, రాజకీయ నాయకుడి మేనరిజమ్స్ మరియు బాడీ లాంగ్వేజ్ అచ్చం కేసీఆర్‌ను తలపించేలా ఉన్నాయని ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు.

ముఖ్యంగా సినిమాలో సవారీ తెగ ప్రజల అస్తిత్వం, గుర్తింపు కోసం పోరాడే క్రమంలో శంకరన్న పలికే డైలాగ్స్‌కు థియేటర్లలో విజిల్స్ పడుతున్నాయి. “బ‌క్క‌గా ఉన్నాడు వీడు ఏం చేస్తాడులే అనుకోకు.. సావు నోట్లో తలకాయ పెట్టేసినాస‌రే.. మీకు గుర్తింపు తీసుకొస్తా!” అంటూ ప్రియదర్శి చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. నాని అద్భుతమైన మాస్ యాక్షన్, అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు తోడుగా ప్రియదర్శి క్యామియో అప్పీరెన్స్ సినిమాకు ప్రధాన బలంగా మారాయి. అలాగే, మరో సీనియర్ దిగ్గజ నటుడు పీ. విజయ్ కుమార్ ఎన్టీఆర్‌ను పోలిన పాత్రలో కనిపించడం ఈ సినిమాకు అదనపు హైలైట్‌గా నిలిచింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← KCR Song | కేసీఆర్ పాటలు పెట్టినందుకు భక్తులపై ఎస్‌ఐ దౌర్జన్యం.. వీడియోNani | నాని కోసం అంజనా ఎమోషనల్ పోస్ట్.. 17 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకున్న భార్య.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com