☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Nani | నాని కోసం అంజనా ఎమోషనల్ పోస్ట్.. 17 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకున్న భార్య..

Nani | నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ నేపథ్యంలో నాని సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన భార్య అంజనా సోషల్ మీడియాలో చేసిన భావోద్వేగ పోస్ట్ ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది.
Nani | నాని కోసం అంజనా ఎమోషనల్ పోస్ట్.. 17 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకున్న భార్య..

Nani | నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ నేపథ్యంలో నాని సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన భార్య అంజనా సోషల్ మీడియాలో చేసిన భావోద్వేగ పోస్ట్ ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది.నాని కెరీర్ ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్న అంజనా.. 2009లో నాని నటించిన సినిమా చూసేందుకు తామంతా కళాశాలకు వెళ్లకుండా సినిమా కోసం వెళ్లామని తెలిపారు. అయితే విడుదల రోజున కనీసం ఉదయం ప్రదర్శన కూడా పడలేదని తెలిసి తాను ఎంతో ఆశ్చర్యపోయానని ఆమె పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు కొత్తగా వచ్చిన నటుడి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఎంత కష్టమో అప్పుడే అర్థమైందని గుర్తుచేసుకున్నారు.

అయితే సరిగ్గా 17 ఏళ్ల తర్వాత నాని సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా థియేటర్లకు వస్తుండటానికి కారణం.. ఒక్కో సినిమాతో ఆయన సంపాదించుకున్న నమ్మకమేనని అంజనా పేర్కొన్నారు. నాని ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం, పట్టుదల, సినిమాలపై ఆయనకున్న ప్రేమ ఉందని ఆమె చెప్పుకొచ్చారు. నాని తన ప్రతి సినిమాను ఒక బిడ్డలా చూసుకున్నారని అంజనా తెలిపారు. కొన్ని సినిమాలు విజయవంతంగా నడిచాయని, మరికొన్ని భారీగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని, ఇంకొన్ని ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోయినా వాటన్నింటినీ నాని తన సినిమాలుగానే భావించారని పేర్కొన్నారు. ఇన్నేళ్ల సినీ ప్రయాణానికి తాను ప్రత్యక్ష సాక్షినని ఆమె చెప్పడం గమనార్హం.

‘ది ప్యారడైజ్’ తన తొలి అడుగులు వేయబోతున్న ఈ సమయంలో ఏం జరిగినా అంతా మంచే జరుగుతుందని అంజనా ధీమా వ్యక్తం చేశారు. నానికి అభిమానులు ఉన్నా లేకపోయినా.. కుటుంబంగా తాము ఎప్పుడూ ఆయనకు అండగా ఉంటామని ఆమె చెప్పిన మాటలు అభిమానులను కదిలిస్తున్నాయి. భర్తపై తనకున్న ప్రేమ, నమ్మకాన్ని ఈ పోస్ట్ ద్వారా అంజనా మరోసారి చాటుకున్నారు. మరోవైపు ‘ది ప్యారడైజ్’ చిత్రబృందానికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. నానిలోని ఉత్సాహం, నిజాయితీ, కొత్తగా ఏదైనా చేయాలనే తపన తనను ఎప్పుడూ ఆకట్టుకుంటాయని ఆయన పేర్కొన్నారు. ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల మరోసారి కలిసి ‘ది ప్యారడైజ్’తో సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. నాని, శ్రీకాంత్ ఓదెలతో పాటు నిర్మాతలు, సంగీత దర్శకుడు అనిరుధ్, మొత్తం చిత్రబృందానికి చిరంజీవి తన శుభాకాంక్షలు, ఆశీస్సులు అందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త మైలురాళ్లు అందుకోవాలని ఆకాంక్షించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← KCR | ‘ది ప్యారడైజ్’లో కేసీఆర్.. దద్దరిల్లుతున్న థియేటర్లు!Fire Accident | ర‌న్నింగ్ బ‌స్సులో ఒక్క‌సారిగా చెల‌రేగిన మంట‌లు.. క్ష‌ణాల్లో ద‌గ్ధం.. Video →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com