☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

TDP vs YCP: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి!

Stone Attack on YSRCP Leaders in Punganur: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా అన్నమయ్య జిల్లాలోని పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బసవరాజా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అభ్యర్థుల తరఫున నామినేషన్లు దాఖలు చేసేందుకు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఇతర వైసీపీ నేతలు అక్కడికి వెళ్లిన సమయంలో టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. నామినేషన్ కేంద్రానికి […]
TDP vs YCP: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి!

Stone Attack on YSRCP Leaders in Punganur: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా అన్నమయ్య జిల్లాలోని పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బసవరాజా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అభ్యర్థుల తరఫున నామినేషన్లు దాఖలు చేసేందుకు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఇతర వైసీపీ నేతలు అక్కడికి వెళ్లిన సమయంలో టీడీపీ శ్రేణులు దాడి చేశాయి.

నామినేషన్ కేంద్రానికి వెళుతున్న మిథున్ రెడ్డి కాన్వాయ్‌లోని వాహనాలపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో వాహనాలు ధ్వంసమైనట్లు వైసీపీ పార్టీ నేతలు పేర్కొన్నారు. మిథున్ రెడ్డి, వైసీపీ నేతలు నామినేషన్ కేంద్రంలోకి వెళ్లిన అనంతరం అక్కడ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. టీడీపీ శ్రేణులు బారికేడ్లను తోసుకుని నామినేషన్ కేంద్రంలోకి దూసుకెళ్లారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఘటనాస్థలిలో పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

పుంగనూరులో చోటుచేసుకున్న పరిణామాలపై వైసీపీ అధిష్ఠానం సీరియస్ అయింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీ నేతలు ఆరోపించారు. ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి చేసి వాహనాలను ధ్వంసం చేయడాన్ని ఖండించారు. ఎన్నికల నిర్వహణలో భద్రతపై వైసీపీ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో పారా మిలిటరీ బలగాలను మోహరించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. నామినేషన్లను ఆన్‌లైన్‌లో కూడా స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నాయి. తాజాగా పుంగనూరులో జరిగిన ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు అవసరమైతే మరోసారి హైకోర్టును ఆశ్రయించే యోచనలో వైసీపీ ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఎన్నికల సంఘం, పోలీసులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సమయంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు జిల్లాలో రాజకీయ వేడిని పెంచాయి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Ranabaali Review: రణబాలి రివ్యూ..Punam Raut Retires: “చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా”.. రిటైర్మెంట్ ప్రకటనపై పూనమ్ భావోద్వేగం.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com