☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

Ranabaali Review: రణబాలి రివ్యూ..

Ranabaali Review: విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక హీరోయిన్‌గా రూపొందిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రణబాలి’. రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాపై అనౌన్స్ చేసిన నాటి నుంచే భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను మరింత పెంచేలా సినిమా యూనిట్ పెద్ద ఎత్తున సినిమాను ప్రమోట్ చేసింది. మరి ఈ క్రమంలో సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. కథ: సినిమా […]
Ranabaali Review: రణబాలి రివ్యూ..

Ranabaali Review: విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక హీరోయిన్‌గా రూపొందిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రణబాలి’. రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాపై అనౌన్స్ చేసిన నాటి నుంచే భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను మరింత పెంచేలా సినిమా యూనిట్ పెద్ద ఎత్తున సినిమాను ప్రమోట్ చేసింది. మరి ఈ క్రమంలో సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

కథ:

సినిమా అంతా 1854 నుంచి 1878 మధ్యలో జరుగుతూ ఉంటుంది. సింగనమల బొబ్బిలి రణబాలి (విజయ్ దేవరకొండ) ఆ ఊరి పాలెగాడి కుటుంబంలో జన్మించిన వారసుడు. ఊపిరి లేకుండా పుట్టిన రణబాలికి ఆ కుటుంబం కొంగుబంగారంగా కొలిచే భద్రమల్లన్న స్వామి ఊపిరి పోసి, రెండు పుష్కరాల వరకు అతనికి ఆయుష్షు ఉంటుందని దీవించి పంపుతాడు. అలా భద్రమల్లన్న స్వామి ఆయుష్షుతో పెరిగిన రణబాలి తన ప్రజలందరికీ అండగా నిలబడుతూ ఉంటాడు. అయితే, ఎప్పుడూ తాగుతూ బాధ్యత లేకుండా తిరిగే రణబాలికి జయమ్మ(రష్మిక)తో పెళ్లి చేస్తారు. ఈ క్రమంలో జయమ్మ అతన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా, కరువు కారణంగా మద్రాసు ప్రాంతమంతా ఎంత ఇబ్బంది పడుతుందో రణబాలి తెలుసుకుంటాడు. ఆ తర్వాత బాధ్యత లేకుండా తిరిగిన రణబాలి, కరువు పీడిత ప్రజలందరికీ ఎలా అండగా నిలబడ్డాడు? అతను ఎందుకు వారికి అండగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది? చివరికి ఏం జరిగింది? అనేదే ఈ సినిమా కథ.

విశ్లేషణ:

నిజానికి, ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూసిన తర్వాత మితిమీరిన హింస ఎక్కువగా కనిపించింది. సినిమా ప్రారంభమైన కొద్దిసేపటి నుంచే ఈ విషయం ఈజీగా అర్థమైపోతుంది. కరువు పీడిత ప్రాంతంలో ఉన్న ఒక పాలెగాడు చివరికి బ్రిటిష్ అధికారులను ఎదిరించి, తనను నమ్ముకున్న ప్రజలకు, తనను నమ్మి వచ్చిన ప్రజలకు కరువు తీర్చే ప్రయత్నం ఎలా చేశాడనేది స్థూలంగా ఈ సినిమా కథ. కథగా చెప్పుకోవడానికి బాగానే ఉంది కానీ, దాన్ని అంతే ఎమోషనల్‌గా, హార్ట్ టచింగ్‌గా స్క్రీన్ మీదకు తీసుకువచ్చే విషయంలో సినిమా టీమ్ కొంత తడబడింది. కథగా చెప్పుకునేటప్పుడు ఆ ఎపిసోడ్స్ చాలా హృద్యంగా, అలాగే హృదయాన్ని కదిలించే విధంగా ఉండి ఉండవచ్చు. కానీ, వాటిని స్క్రీన్ మీదకు తీసుకువచ్చే విషయంలో హింస విషయంలో జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. ఎందుకంటే, విజయ్ దేవరకొండ అనగానే ఫ్యామిలీస్ ఎక్కువగా సినిమా థియేటర్‌కు వెళ్లడానికి ఆసక్తి కనబరుస్తారు. కానీ, ఈ సినిమా విషయంలో హింస పాళ్లు బాగా ఎక్కువయ్యాయి. రక్తపాతం కూడా అలాగే ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. బ్రిటిష్ అధికారులు వర్సెస్ అప్పటి స్వాతంత్ర్య సమరయోధులు అనే లైన్‌లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఒక రకంగా, ఇది కూడా అదే లైన్‌లో సాగే సినిమా. ఒక పాలెగాడు అనుకోకుండా కరువు పీడిత ప్రజలను చూసి, మనసు చలించి, వారి కోసం పోరాడిన కథగా దీన్ని రాసుకున్నారు.

సినిమా కథ బాగానే ఉన్నా, కథనంతో దాన్ని ముందుకు తీసుకెళ్లిన విధానం, ముఖ్యంగా నిడివి, కొంతవరకు ఇబ్బంది పెట్టే అంశమే. సినిమా చూస్తున్నంత సేపు నిజంగా ఒకప్పుడు కరువు వల్ల ఇన్ని ఇబ్బందులు పడ్డారా అని ఆలోచన కలగడంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే, ఇలాంటి సినిమాలు ఎంచుకున్నప్పుడు దాన్ని అంతే రిలేటబుల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. కానీ, ఈ సినిమా విషయంలో రిలేటబిలిటీ కొంతవరకు కనిపించకపోవచ్చు. అయితే, సోషల్ మీడియాలో కనిపిస్తున్నంత నెగెటివిటీ అయితే సినిమాలో లేదు.

ఒక రకంగా చెప్పాలంటే, విజయ్ దేవరకొండ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని థియేటర్లకు వచ్చే వారి కోసం చేసిన సినిమా కాదు ఇది. దర్శకుడు తాను చెప్పాలనుకున్న ఒక కథను హానెస్ట్‌గా చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. కాబట్టి, విజయ్ దేవరకొండ హీరో, రష్మిక హీరోయిన్ అనే అంచనాలతో థియేటర్లకు రాకుండా, రాహుల్ సంకృత్యాయన్ చెప్పాలనుకున్న ఒక హానెస్ట్ మూవీ చూడాలనుకునే వారికి ఇది నచ్చొచ్చు.

నటీనటుల విషయానికి వస్తే, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రణబాలి అనే పాత్రలో లీనమై నటించాడు. ఆ పాత్రలో తనదైన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక రష్మిక కూడా జయమ్మ పాత్రలో ఒదిగిపోయింది. ఆమెకు స్క్రీన్ స్పేస్ తక్కువే అయినప్పటికీ, ఉన్నంతలో ఆకట్టుకుంది. ఇక భద్రమల్లన్న పాత్రలో నటించిన లాల్ కనిపించింది రెండు, మూడు సీన్లే అయినా తనదైన ఇంపాక్ట్ కనబరిచాడు. ఇక ‘ది మమ్మీ’ నటుడు విలన్‌గా తనదైన శైలిలో విలనిజం పండించాడు. తమిళ నటుడు, వివేక్ సాగర్, కంచరపాలెం కిషోర్ వంటి వారు చాలా మంచి పాత్రల్లో నటించారు. మిగతా పాత్రధారులందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, ఈ సినిమా సాంగ్స్ స్క్రీన్ మీద కూడా బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా సినిమాకి తగ్గట్టుగా ఉంది. సినిమాటోగ్రఫీ వర్క్ అప్పటి కాలాన్ని మళ్లీ మన కళ్లకు చూపించే ప్రయత్నం చేసింది. అలాగే ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పనితీరును ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సిందే. ఏవో కొండలు, గుట్టలు లాంటి కొన్ని ప్రదేశాలు తప్ప, మిగతా సీన్స్ అన్నీ ప్రత్యేకమైన సెట్స్‌లో షూట్ చేసినవే అనే ఫీలింగ్ రాకుండా, రియల్ లొకేషన్స్ అనే ఫీలింగ్ కలిగించారు. ఇక కథ పరంగా ఎక్కడా వంకలు పెట్టడానికి లేకపోయినా, కథనంతో నడిపించిన తీరు సినిమాకి కాస్త ఇబ్బందికర అంశం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక నిడివి విషయంలో కూడా ఇంకా కేర్ తీసుకుని ఉంటే, రిజల్ట్ ఇంకాస్త బెటర్‌గా ఉండి ఉండేది.

ఫైనల్లీ, విజయ్ దేవరకొండ ‘రణబాలి’… హానెస్ట్ అటెంప్ట్.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఊరట.. తిరంగా మార్చ్‌పై తక్షణ ఆదేశాలకు నిరాకరణ!TDP vs YCP: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com