సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జైలర్ 2’. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో 2023లో వచ్చిన ‘జైలర్’ మూవీకి సీక్వెల్‌గా ‘జైలర్ 2’ వచ్చింది. గురువారం (అక్టోబర్ 15) ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ కు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ముఖ్యంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ స్టైల్, మేనరిజం, ఎలివేషన్స్‌ను చక్కగా చూపించి మరోసారి మ్యాజిక్ చేసేశాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్. దీంతో ఫస్ట్ రోజే జైలర్ 2 సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. ప్రముఖ ట్రేడ్ సైట్ శాక్నిల్క్ ప్రకారం జైలర్ 2 సినిమాకు సుమారు రూ. 125.25 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లోనూ రజనీ సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. కాగా ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటించారు. మరికొందరు క్యామియో రోల్స్ పోషించారు. రమ్యకృష్ణ, విద్యాబాలన్ మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి, మిథున్ చక్రవర్తి, సూరజ్ వెంజరమూడు, యోగిబాబు, మిర్నా మేనన్, రిత్విక్ తదితరులు జైలర్ లో యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీలో టాలీవుడ్ సీనియర్ హీరో నందమరి బాలకృష్ణ కూడా నటించాల్సింది. కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు.
‘జైలర్’ మూవీలోనే నందమూరి బాలకృష్ణతో ఓ గెస్ట్ రోల్ చేయించాలని భావించాడు డైరెక్టర్ నెల్సన్ . కన్నడ నుంచి శివ రాజ్‌కుమార్, మలయాళం నుంచి మోహన్‌లాల్, బాలీవుడ్ నుంచి జాకీ ష్రాఫ్ గెస్ట్ రోల్స్ చేశారు. అయితే తెలుగు నుంచి ఏ హీరో కూడా ‘జైలర్’ మూవీలో కనిపించలేదు. అయితే ఎలాగైనా జైలర్ 2లో తెలుగు నుంచి బాలకృష్ణతో గెస్ట్ రోల్ చేయించాలని డైరెక్టర్ అనుకున్నారు. మొదట్లో బాలయ్య కూడా రజనీ మూవీలో నటించేందుకు ఆసక్తి చూపించారని వార్తలు వచ్చాయి. అయితే ఏమైందో తెలియదు కానీ బాలయ్య ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. కాగా అలా
బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్లోనే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ కనిపించాడని సమాచారం. సినిమాలో హృతిక్ క్యామియోకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. కనిపించేది కాసేపే అయినా థియటేర్లలో ఈ సీన్లకు విజిల్స్ పడుతున్నాయి. అయితే ఈ రోల్లో నందమూరి బాలకృష్ణ కనిపించి ఉంటే మరింత బాగుండేదని నందమూరి అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బాలయ్య రేంజ్‌కు ఈ రోల్ చాలా చిన్నదిగా ఉందని, ఆయన చేయకపోవడమే మంచిదైందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






