☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

Mahesh Babu : షూటింగ్‌కి కాదు ప్రమోషన్స్‌కి డేట్లు అడుగుతున్న రాజమౌళి.. మహేష్ ఏం చేస్తాడో..

ప్రమోషన్స్ కి కూడా సపరేట్ డేట్స్ కేటాయించామని రాజమౌళి నుంచి పెద్ద లిస్ట్ వచ్చిందట. (Mahesh Babu)
Mahesh Babu : షూటింగ్‌కి కాదు ప్రమోషన్స్‌కి డేట్లు అడుగుతున్న రాజమౌళి.. మహేష్ ఏం చేస్తాడో..

Mahesh Babu : రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో వారణాసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ నెలతో వారణాసి షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7న సినిమా రిలీజ్ చేస్తారని కూడా ప్రకటించారు. మరి అప్పటికి రిలీజ్ అవుతుందా లేదా అంటే ఎదురుచూడాల్సిందే. తాజాగా వారణాసి సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది.

ఇన్నాళ్లు వేరే సినిమా షూటింగ్స్ చేయకుండా, విదేశాలకు కూడా తక్కువగా వెళ్తూ మహేష్ వారణాసి సినిమా షూటింగ్ కి తన డేట్స్ కేటాయించాడు. ఇప్పుడు ప్రమోషన్స్ కి కూడా సపరేట్ డేట్స్ కేటాయించామని రాజమౌళి నుంచి పెద్ద లిస్ట్ వచ్చిందట. రాజమౌళి ప్రమోషన్స్ అంటే ఏ రేంజ్ లో ఉంటాయో అందరికి తెలిసిందే. ప్రమోషన్స్ కూడా సినిమా రేంజ్ లో చేస్తారు. పాన్ ఇండియా సినిమాలకే చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లను ఇండియా అంతా తిప్పుతూ బాగా కష్టపెట్టారు.

Also Read : Kevvu Kartheek : అమ్మవారి ఆలయంలో ఫ్యామిలీతో జబర్దస్త్ కెవ్వు కార్తీక్.. దసరా స్పెషల్..

ఇప్పుడు ఏకంగా పాన్ వరల్డ్ సినిమా. హాలీవుడ్ లో ఆల్రెడీ ప్రమోషన్స్ చేసారు. మున్ముందు పాన్ ఇండియాతో పాటు హాలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ చేయబోతున్నారు. దీంతో జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఏయే తేదీల్లో అందుబాటులో ఉండాలి అని మహేష్ బాబుకి రాజమౌళి ప్రమోషనల్ డేట్స్ కోసం లిస్ట్ పంపారట. దాని బట్టి మహేష్ తన ప్లాన్స్ చేసుకోవాలి. ఒకవేళ సినిమా వాయిదా పడితే ఆ డేట్స్ మారడం ఖాయం. కానీ కనీసం నెలకు ఒక వారం రోజులు అయినా ప్రమోషన్స్ కి అందుబాటులో ఉండేలా చేసుకొమ్మని రాజమౌళి మహేష్ ని అడిగాడట. మరి మహేష్ బాబు ప్రమోషన్స్ కి ఇచ్చే డేట్స్ ని రాజమౌళి ఏ రేంజ్ లో వాడతారో చూడాలి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Khushi Kapoor : మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఖుషి కపూర్.. బికినీలో ఫోటోలు వైరల్..గొడ్డళ్లను సప్లై చేసే నాయకుడు చంద్రబాబు – జగన్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com