☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

గొడ్డళ్లను సప్లై చేసే నాయకుడు చంద్రబాబు – జగన్

AP Municipal Elections : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తలెత్తిన ఉద్రిక్తతలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో...
గొడ్డళ్లను సప్లై చేసే నాయకుడు చంద్రబాబు – జగన్

AP Municipal Elections : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తలెత్తిన ఉద్రిక్తతలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నిజంగానే ప్రజల మద్దతు ఉంటే, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న పోలీసులు అధికార టీడీపీ నాయకులకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని, మరోవైపు అధికారులు కూడా తమ పార్టీ అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించడం లేదని ఆరోపించారు. చంద్రబాబుకు ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిపించే ధైర్యం లేదని తీవ్రంగా విమర్శించారు.

Read Also : విజయ్ లేడీ ఫ్యాన్ బంపరాఫర్..ఏంటో తెలుసా ?

‘అధర్మ చరిత్ర.. రక్త చరిత్ర’: వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు!

సీఎం చంద్రబాబుపై పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడిన జగన్.. “వెన్నుపోటు పార్టీ నాయకుడు, గొడ్డళ్లను సప్లై చేసే నాయకుడు రాష్ట్రంలో అధర్మ చరిత్రను, రక్త చరిత్రను రాస్తున్నాడు. ప్రజాస్వామ్యంలో ఇది ధర్మమేనా, న్యాయమేనా?” అని నిలదీశారు. నామినేషన్ల ఘట్టం ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమాలు, దాడులు జరుగుతున్నాయని, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. పోటీ చేసే హక్కును కూడా కాలరాస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, దీనిపై తాము ప్రజాక్షేత్రంలోనూ, న్యాయస్థానంలోనూ పోరాటం కొనసాగిస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Mahesh Babu : షూటింగ్‌కి కాదు ప్రమోషన్స్‌కి డేట్లు అడుగుతున్న రాజమౌళి.. మహేష్ ఏం చేస్తాడో..OTTలోకి నాని ‘ప్యారడైజ్’.. డేట్ ఫిక్స్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com