☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Rama Nandana | ‘సెప్టెంబర్ 7న‌ నా జీవితంలో కఠినమైన పరిస్థితి’ .. ర‌మా నంద‌న ఎమోష‌న‌ల్ పోస్ట్ వైర‌ల్‌

Rama Nandana | సోషల్ మీడియాలో యూట్యూబర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రమా నందన పేరు గత కొద్దిరోజులుగా ఓ కేసు నేపథ్యంలో వార్తల్లో నిలుస్తోంది. విదేశాల్లో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలకు సంబంధించిన కేసులో ఆమెను హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
Rama Nandana | ‘సెప్టెంబర్ 7న‌ నా జీవితంలో కఠినమైన పరిస్థితి’ .. ర‌మా నంద‌న ఎమోష‌న‌ల్ పోస్ట్ వైర‌ల్‌

Rama Nandana | సోషల్ మీడియాలో యూట్యూబర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రమా నందన పేరు గత కొద్దిరోజులుగా ఓ కేసు నేపథ్యంలో వార్తల్లో నిలుస్తోంది. విదేశాల్లో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలకు సంబంధించిన కేసులో ఆమెను హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య నందన తాజాగా చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. రమా నందన తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫొటోను పంచుకుంటూ భావోద్వేగంతో కూడిన క్యాప్షన్ రాసింది. సెప్టెంబర్ 7న గ్రౌండ్‌లోకి అడుగుపెట్టిన సమయంలో తన జీవితంలో ఒక కఠినమైన పరిస్థితిని ఎదుర్కొన్నానని ఆమె ఆ పోస్ట్‌లో గుర్తు చేసుకుంది.

ప్రస్తుతం తనపై కొనసాగుతున్న కేసు, న్యాయపరమైన పరిణామాల నేపథ్యంలో నందన చేసిన ఈ వ్యాఖ్యలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. అయితే తన తాజా పోస్టులో మాత్రం కేసు గురించి ఆమె ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. తనకు ఎదురైన పరిస్థితిని వ్యక్తిగత అనుభూతిగా మాత్రమే పంచుకుంది. కాగా, రమా నందన, ఆమె భర్త మధుకర్‌కు సంబంధించిన వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌లోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. యూకేలో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారంటూ కొందరు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.ఈ కేసులో ఓ బాధితుడు తాను నందన ద్వారా మోసపోయానని, సుమారు రూ.15 లక్షలు చెల్లించినట్లు ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో నందనపై లుక్‌ఔట్ నోటీసులు జారీ అయినట్లు సమాచారం.

సెప్టెంబర్ 7న రమా నందన హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు లుక్‌ఔట్ నోటీసుల ఆధారంగా ఆమెను గుర్తించారు. అనంతరం ఆమెను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత పోలీసుల నోటీసుల మేరకు నందన విచారణకు హాజరయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు ఆమెను ప్రశ్నించినట్లు వార్తలు వెలువడ్డాయి. ముఖ్యంగా ‘డెస్టినీ కన్సల్టెన్సీ’కి సంబంధించిన వ్యవహారాలపై పోలీసులు ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం.అయితే కన్సల్టెన్సీ వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని నందన గతంలోనే చెప్పింది. ఆ వ్యవహారాలను తన భర్త మధుకర్ చూసుకుంటారని విచారణలో ఆమె వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి.అంతేకాకుండా తనపై, తన కుటుంబంపై కావాలనే తప్పుడు ప్రచారం జరుగుతోందని నందన గతంలో ఆరోపించారు

View this post on Instagram

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Suryapet Road Accident | అర్ధరాత్రి అదుపుతప్పిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు.. ముగ్గురికి స్వల్ప గాయాలుపగిడేరులో బీఆర్‌ఎస్‌ యువజన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.. యువజన అధ్యక్షుడిగా పూనెం రాము →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com