☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

మోరంపల్లి బంజర్లో గాలివాన బీభత్సం

మోరంపల్లి బంజర్లో గాలివాన బీభత్సం Caption of Image. గాలి దుమారంతో ఎగిరిపోయిన రేకులు, నేలకొరిగిన చెట్లు బూర్గంపహాడ్, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం మోరంపల్లి బంజర్​లో బుధవారం గాలివాన బీభత్సం సృష్టించింది. మండలంలోని పలు ప్రాంతాల్లో గాలులతో కూడిన వర్షం పడగా, మోరంపల్లి బంజర్ సమీపంలో బలమైన ఈదురుగాలులు వీయడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గ్రామంలోని ప్రధాన సెంటర్ లో టోర్నడో మాదిరిగా ఒక్కసారిగా కారుమబ్బులు కమ్ముకొని గాలిదుమారం బీభత్సం సృష్టించింది. కేవలం బస్టాండ్ సెంటర్ లోనే నిమిషం పాటు వీచిన బలమైన గాలుల ధాటికి ఇళ్లపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. హోర్డింగ్​లు, తోపుడుబండ్లు సైతం రోడ్డుపైకి కొట్టుకువచ్చాయి. తోపుడు బండిపై అర
మోరంపల్లి బంజర్లో గాలివాన బీభత్సం
మోరంపల్లి బంజర్లో గాలివాన బీభత్సం
  • గాలి దుమారంతో ఎగిరిపోయిన రేకులు, నేలకొరిగిన చెట్లు

బూర్గంపహాడ్, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం మోరంపల్లి బంజర్​లో బుధవారం గాలివాన బీభత్సం సృష్టించింది. మండలంలోని పలు ప్రాంతాల్లో గాలులతో కూడిన వర్షం పడగా, మోరంపల్లి బంజర్ సమీపంలో బలమైన ఈదురుగాలులు వీయడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గ్రామంలోని ప్రధాన సెంటర్ లో టోర్నడో మాదిరిగా ఒక్కసారిగా కారుమబ్బులు కమ్ముకొని గాలిదుమారం బీభత్సం సృష్టించింది.

కేవలం బస్టాండ్ సెంటర్ లోనే నిమిషం పాటు వీచిన బలమైన గాలుల ధాటికి ఇళ్లపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. హోర్డింగ్​లు, తోపుడుబండ్లు సైతం రోడ్డుపైకి కొట్టుకువచ్చాయి. తోపుడు బండిపై అరటికాయలు అమ్ముకునే కృష్ణారెడ్ది బండితో పాటు కొంతదూరం కొట్టుకుపోవడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి.

సడెన్​గా వీచిన గాలితో వ్యాపారులు, స్థానిక ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. రోడ్లపై నేలకూలిన చెట్లు, ఇతర వస్తువులతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. గాలిదుమారంతో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

html, body,
⬇ Full News JPG⬇ Short News JPG
← బీసీ జనాభా లెక్కల్లో గోల్మాల్.. TRP చీఫ్ తీన్మార్ మల్లన్నసింగరేణిలో మైన్స్ రెస్క్యూ పోటీలు షురూ.. కాంపిటీషన్స్లో పాల్గొన్న పది జట్లు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com