☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!

Ranabaali | టాలీవుడ్ క్రేజీ జోడీ విజయ్ దేవరకొండ, రష్మిక మందానా కలిసి నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!

Ranabaali | టాలీవుడ్ క్రేజీ జోడీ విజయ్ దేవరకొండ, రష్మిక మందానా కలిసి నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘గీత గోవిందం’ తర్వాత ఈ జంట మరోసారి తెరపై కనిపించడం, ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించడంతో సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే థియేటర్లలోకి వచ్చిన తర్వాత సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. దీంతో తొలి రోజు వసూళ్లు అంచనాలకు తగ్గట్టుగా లేవనే చర్చ సినీ వర్గాల్లో మొదలైంది. సాక్నిల్క్ వెబ్‌సైట్ గణాంకాల ప్రకారం.. ‘రణబాలి’ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు సుమారు రూ.16.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. భారతదేశంలో రూ.10.75 కోట్ల గ్రాస్, రూ.9.25 కోట్ల నికర వసూళ్లు వచ్చినట్లు అంచనా. విదేశీ మార్కెట్లలో సుమారు రూ.5.75 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా సుమారు 2,515 స్క్రీన్స్‌పై విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు సగటున 57 శాతం ఆక్యుపెన్సీ నమోదైనట్లు సమాచారం. ఉదయం ప్రదర్శనలకు ఆక్యుపెన్సీ 40.92 శాతంగా ఉండగా, రాత్రి ప్రదర్శనల సమయానికి అది 67.92 శాతానికి పెరిగినట్లు సాక్నిల్క్ గణాంకాలు సూచిస్తున్నాయి. అయితే ఈ వసూళ్లు ప్రాథమిక అంచనాలు మాత్రమే. చిత్ర బృందం అధికారికంగా ప్రకటించే లెక్కలు వెలువడితేనే వాస్తవ పరిస్థితిపై స్పష్టత వస్తుంది.విజయ్ దేవరకొండ గత చిత్రాల తొలి రోజు వసూళ్లతో పోల్చితే ‘రణబాలి’ ప్రారంభం కొంత నిరాశపరిచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘కింగ్‌డమ్’ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు సుమారు రూ.30 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు గతంలో ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ‘లైగర్’ కూడా తొలి రోజు సుమారు రూ.15.95 కోట్ల వసూళ్లతో వార్తల్లో నిలిచింది.

‘ఖుషి’ భారతదేశంలో తొలి రోజు సుమారు రూ.9.87 కోట్ల నికర వసూళ్లు సాధించినట్లు అంచనాలు ఉన్నాయి. ‘ఫ్యామిలీ స్టార్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రాలతో పోలిస్తే ‘రణబాలి’ మెరుగైన ఆరంభాన్ని అందుకున్నప్పటికీ, భారీ బడ్జెట్‌తో పాటు విజయ్, రష్మికల క్రేజీ కాంబినేషన్‌ను దృష్టిలో పెట్టుకుంటే ఈ వసూళ్లు ఇంకా ఎక్కువగా ఉండాల్సిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 1876–78 మధ్య కాలంలో జరిగిన మహా మద్రాసు కరువు, బ్రిటిష్ పాలకుల నిరంకుశ విధానాల నేపథ్యంలో ‘రణబాలి’ కథ సాగుతుంది. కరువుతో అల్లాడుతున్న ప్రజల తరఫున నిలబడి బ్రిటిష్ పాలకులను ఎదిరించే సింగనమాల బొబ్బిలి రణబలి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించారు. ఆయన భార్య జయమ్మగా రష్మిక మందానా నటించారు. ప్రస్తుతం ‘రణబాలి’ చిత్రానికి దసరా పండుగ సెలవులు కీలకంగా మారనున్నాయి. సెలవుల కారణంగా కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉండటంతో రానున్న రోజుల్లో వసూళ్లు పెరుగుతాయనే ఆశాభావం చిత్ర బృందంలో ఉండవచ్చు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్‌–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com