☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్‌–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..

మక్తల్‌–నారాయణపేట నాలుగు లైన్ల రహదారి నిర్మాణ పనులు ప్రారంభించడంలో జాప్యాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పాదయాత్రకు సిద్ధమయ్యారు.
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్‌–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..

మక్తల్‌–నారాయణపేట నాలుగు లైన్ల రహదారి నిర్మాణ పనులు ప్రారంభించడంలో జాప్యాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పాదయాత్రకు సిద్ధమయ్యారు. శనివారం ఉదయం 8 గంటలకు మక్తల్‌ నుంచి నారాయణపేట జిల్లా కేంద్రం వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకుని రహదారి పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని డిమాండ్‌ చేయనున్నారు.

మక్తల్‌–నారాయణపేట మధ్య ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఈ రహదారిపై సుమారు 180 గుంతలు ఉన్నట్లు గుర్తించారు. హెచ్‌ఏఎం (హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌) పద్ధతిలో నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి సుమారు రూ.280 కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రులు ప్రకటించారు. అయినప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, అనంతరం జూలై 13న రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి మరోసారి శంకుస్థాపన చేశారు. అయినా పనులు ముందుకు సాగకపోవడంతో రహదారి పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనూ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. 2023 అక్టోబర్‌ 9న అప్పటి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో పనులు నిలిచిపోయాయి. ప్రభుత్వం మారిన తర్వాత కూడా నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో రహదారి నిర్మాణ పనుల్లో జాప్యాన్ని నిరసిస్తూ చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపడుతున్నారు. రూ.280 కోట్లతో చేపట్టనున్న నాలుగు లైన్ల రహదారి పనులను ఇకనైనా ప్రారంభించి, ప్రజల ఇబ్బందులు తొలగించాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్‌ మీద షాక్‌!Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com