☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!

Nara Lokesh Praises Ranabali Trailer: రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘రణబాలి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం (అక్టోబర్ 8) చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. […]
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!

Nara Lokesh Praises Ranabali Trailer: రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘రణబాలి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం (అక్టోబర్ 8) చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. రణబాలి ట్రైలర్‌ను వీక్షించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చిత్ర బృందాన్ని ప్రశంసించారు.

1800ల నాటి రాయలసీమ వాతావరణాన్ని, బ్రిటిష్ పాలనలో కరువు, అణచివేతతో ప్రజలు ఎదుర్కొన్న హృదయవిదారక పరిస్థితులను తెరపై ఆవిష్కరించిన తీరు అద్భుతంగా ఉందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ‘రణబాలి ట్రైలర్ ఇప్పుడే చూశాను. వావ్.. చాలా బాగుంది. అద్భుతమైన అనుభూతి కలిగింది. 1800ల నాటి రాయలసీమ వాతావరణాన్ని.. బ్రిటిష్ పాలనలో కరువు, అణచివేతతో ప్రజలు ఎదుర్కొన్న హృదయవిదారక పరిస్థితులను తెరపై ఆవిష్కరించిన తీరు అద్భుతం. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఎంతో సహజంగా, శక్తివంతంగా కనిపిస్తున్నారు. రాయలసీమ నేలతో మమేకమైన నటనతో విజయ్ ఆకట్టుకున్నారు. రష్మిక మందన్న తన పాత్రకు అద్భుతంగా ప్రాణం పోశారు’ అని మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు.

‘చరిత్రలోని అంతగా వెలుగులోకి రాని ఓ శక్తివంతమైన ఘట్టాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్‌తో పాటు మొత్తం చిత్ర బృందానికి అభినందనలు. అక్టోబర్ 16న మీ అందరికీ గొప్ప విజయం కలగాలని ఆకాంక్షిస్తున్నాను’ అని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ట్రైలర్‌కు వస్తున్న స్పందనతో సినిమాపై ఆసక్తి బజ్ పెరిగింది. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ హయాంలో సాగే వాస్తవ చారిత్రక అంశాల ఆధారంగా డైరెక్టర్ ఈ కథను మలిచారు. పన్నుల దోపిడీ, ఆకలి కేకలతో అలమటిస్తున్న ప్రజల తరఫున ఆంగ్లేయులపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన యోధుడు ‘శింగనమల బొబ్బిలి రణబాలి’గా విజయ్ నటన అద్భుతంగా ఉంది. రణబాలి మూవీ విజయ్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!కొత్త అల్లాయ్ వీల్స్, అప్‌డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com