☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

కొత్త అల్లాయ్ వీల్స్, అప్‌డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?

Toyota Fortuner 2026 Leader Edition: టయోటా భారత్‌లో 2026 ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్‌ను విడుదల చేసింది. మార్కెట్లో మంచి గుర్తింపు ఉన్న ఫార్చ్యూనర్ ఎస్‌యూవీకి కొత్త స్టైలింగ్, మరిన్ని సౌకర్యాలను జత చేసింది. ఈ కొత్త ఎడిషన్ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.36.51 లక్షలుగా నిర్ణయించింది. ఇందులో 4×2 మాన్యువల్, 4×2 ఆటోమేటిక్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ బుకింగ్స్ 2026 అక్టోబర్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త ఫీచర్లు కొత్త ఫార్చ్యూనర్ […]
కొత్త అల్లాయ్ వీల్స్, అప్‌డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?

Toyota Fortuner 2026 Leader Edition: టయోటా భారత్‌లో 2026 ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్‌ను విడుదల చేసింది. మార్కెట్లో మంచి గుర్తింపు ఉన్న ఫార్చ్యూనర్ ఎస్‌యూవీకి కొత్త స్టైలింగ్, మరిన్ని సౌకర్యాలను జత చేసింది. ఈ కొత్త ఎడిషన్ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.36.51 లక్షలుగా నిర్ణయించింది. ఇందులో 4×2 మాన్యువల్, 4×2 ఆటోమేటిక్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ బుకింగ్స్ 2026 అక్టోబర్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి.

కొత్త ఫీచర్లు

కొత్త ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్‌లో ఇంజిన్ మార్పుల కంటే డిజైన్, సౌకర్యాలపైనే టయోటా ప్రధానంగా దృష్టి పెట్టింది. ముందు భాగంలో రివైజ్డ్ గ్రిల్, గ్లోస్ బ్లాక్ అల్లాయ్ వీల్స్, మ్యాచింగ్ హబ్ క్యాప్స్‌ను అందించారు. వెనుక డోర్ గార్నిష్, యాంటెన్నాకు బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చారు. బ్లాక్ రూఫ్, బాడీ సైడ్ మోల్డింగ్స్ ఎస్‌యూవీకి మరింత ఆకర్షణీయమైన రూపాన్ని అందిస్తాయి. ప్రత్యేకమైన బానెట్ ఎంబ్లమ్ కూడా ఈ ఎడిషన్‌లో మరో హైలైట్‌గా నిలుస్తుంది.

ప్రీమియం ఇంటీరియర్..

క్యాబిన్‌లో బ్లాక్, మెరూన్ కలర్ కాంబినేషన్‌తో కూడిన సీటు అప్హోల్స్టరీ, డోర్ ట్రిమ్స్‌ను అందించారు. యాంబియంట్ లైటింగ్, ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్స్‌తో ఇంటీరియర్‌కు ప్రీమియం లుక్ తీసుకొచ్చారు. ఆటో ఫోల్డింగ్ ఔట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి ఫీచర్లను కూడా జోడించారు. ఇవి రోజువారీ డ్రైవింగ్‌లో మరింత సౌకర్యాన్ని అందించనున్నాయి. కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే సూపర్ వైట్, ప్లాటినం వైట్ పెర్ల్, అటిట్యూడ్ బ్లాక్ రంగుల్లో ఈ ఎస్‌యూవీ లభించనుంది.

ధరలు

ఈ ఎస్‌యూవీ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు..

* 4×2 మాన్యువల్: రూ.36.51 లక్షలు
* 4×2 ఆటోమేటిక్: రూ.38.72 లక్షలు
ఈ రెండు ధరలు ఎక్స్‌షోరూమ్ ధరలు. ఆటోమేటిక్ వేరియంట్ ధర మాన్యువల్ వేరియంట్ కంటే రూ.2.21 లక్షలు ఎక్కువ. రెండు వేరియంట్లలోనూ రియర్ వీల్ డ్రైవ్‌తో కూడిన 4×2 సెటప్ ఉంటుంది. ఈ ఎడిషన్‌లో 4×4 వేరియంట్‌ను ప్రకటించలేదు. ఇంజిన్, గేర్‌బాక్స్ లేదా పనితీరులో ఎలాంటి మార్పులను టయోటా వెల్లడించలేదు.

కొత్త ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్ కొనుగోలుదారుల కోసం టయోటా పలు ఫైనాన్స్ సదుపాయాలను అందిస్తోంది. గరిష్ఠంగా ఏడేళ్ల వరకు ఫైనాన్స్‌తో పాటు స్మార్ట్ బెలూన్ ఫైనాన్స్ స్కీమ్‌ను కూడా అందుబాటులో ఉంచింది. ఐదేళ్ల పాటు ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్, మూడేళ్లు లేదా లక్ష కిలోమీటర్ల వరకు (ఏది ముందుగా పూర్తయితే అది) స్టాండర్డ్ వారంటీ లభిస్తుంది. అంతేకాకుండా ఐదేళ్లు లేదా 2.20 లక్షల కిలోమీటర్ల వరకు ఎక్స్‌టెండెడ్ వారంటీని పొందే అవకాశం ఉంది.

⬇ Full News JPG⬇ Short News JPG
← Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com