☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!

Irumudi Movie Bridge Collapses at Polluru Waterfalls: ప్రకృతి అందాలకు నెలవైన పోలవరం జిల్లా చింతూరు మండలంలోని పొల్లూరు జలపాతం వద్ద ‘ఇరుముడి’ సినిమా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్టింగ్ బ్రిడ్జి వరద ఉధృతికి కొట్టుకుపోయింది. కొద్దిరోజులుగా కొండవాగుల నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో పొల్లూరు జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో జలపాతం వద్ద ఏర్పాటు చేసిన బ్రిడ్జి వరద తాకిడికి కుప్పకూలింది. ఇరుముడి సినిమా విడుదలైన తర్వాత పొల్లూరు […]
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!

Irumudi Movie Bridge Collapses at Polluru Waterfalls: ప్రకృతి అందాలకు నెలవైన పోలవరం జిల్లా చింతూరు మండలంలోని పొల్లూరు జలపాతం వద్ద ‘ఇరుముడి’ సినిమా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్టింగ్ బ్రిడ్జి వరద ఉధృతికి కొట్టుకుపోయింది. కొద్దిరోజులుగా కొండవాగుల నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో పొల్లూరు జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో జలపాతం వద్ద ఏర్పాటు చేసిన బ్రిడ్జి వరద తాకిడికి కుప్పకూలింది.

ఇరుముడి సినిమా విడుదలైన తర్వాత పొల్లూరు జలపాతానికి పర్యాటకుల రాక గణనీయంగా పెరిగింది. గతంలో వందల సంఖ్యలో మాత్రమే వచ్చే పర్యాటకులు.. ప్రస్తుతం వేల సంఖ్యలో పొల్లూరుకు తరలివస్తున్నారు. ముఖ్యంగా సెలవు రోజుల్లో సుమారు 5 వేల నుంచి 10 వేల మంది వరకు జలపాతం అందాలను వీక్షించేందుకు వస్తున్నారు. ఇరుముడి సినిమాలో చిత్రీకరించిన ప్రాంతాలను ప్రత్యక్షంగా చూసేందుకు పర్యాటకులు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా జలపాతం వద్ద సినిమా చిత్రీకరణ కోసం ఏర్పాటు చేసిన బ్రిడ్జి సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది.

బ్రిడ్జిపై నుంచి జలపాతాన్ని దగ్గరగా వీక్షించే అవకాశం ఉండటంతో పర్యాటకులకు ఇది ప్రత్యేక అనుభూతిని అందించేది. చిన్నారుల నుంచి పెద్దల వరకు బ్రిడ్జిపై నిలబడి జలపాతం అందాలను ఆస్వాదిస్తూ సందడి చేసేవారు. ప్రకృతి అందాలను తమ కెమెరాల్లో బంధించడంతో పాటు సెల్ఫీలు, ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ ఆనందించేవారు. దీంతో ఈ బ్రిడ్జి పొల్లూరు జలపాతం సందర్శనలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. అయితే ప్రస్తుతం భారీ వరదల కారణంగా సినిమా కోసం ఏర్పాటు చేసిన బ్రిడ్జి కొట్టుకుపోవడంతో పొల్లూరు వచ్చే పర్యాటకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి ఉన్న సమయంలో తీసుకున్న ఫొటోలు, వీడియోలను గుర్తుచేసుకుంటూ ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ నటించిన ఇరుముడి బ్లాక్ బస్టర్ అయింది. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ డివోషనల్ థ్రిల్లర్ రూ.250 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం ఓటీటీలో కూడా ఇరుముడి దుమ్ములేపుతోంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com