☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

సిరిసిల్లలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రవీంద్ర కుమార్ ఆగ్రహం

సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని బీఆర్‌ఎస్ పార్టీ నల్ల‌గొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ విమర్శించారు. ఎన్నికలు జరిగి దాదాపు మూడేళ్లు గడిచిపోయాయని...
సిరిసిల్లలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రవీంద్ర కుమార్ ఆగ్రహం

– అభివృద్ధి, హామీలపై సమాధానం లేదు
– వ్యక్తిగత విమర్శలే తప్ప కేటీఆర్ ప్రశ్నలకు జవాబు లేదు

దేవ‌ర‌కొండ‌, అక్టోబ‌ర్ 01 : సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని బీఆర్‌ఎస్ పార్టీ నల్ల‌గొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ విమర్శించారు. ఎన్నికలు జరిగి దాదాపు మూడేళ్లు గడిచిపోయాయని, ఇంకా రెండేళ్ల సమయం మాత్రమే మిగిలి ఉందన్నారు. ఇంతకాలం పాలనలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన హామీలపై ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. సిరిసిల్లలో ‘ప్రజా పాలన సభ’ నిర్వహించిన ముఖ్యమంత్రి రాష్ట్ర సమస్యలు, ప్రజలకు ఇచ్చిన హామీలు, అభివృద్ధి పనులపై స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా కేటీఆర్‌, కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. కేటీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా రాజకీయ విమర్శలకే పరిమితం కావడం ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమేనని విమర్శించారు. ప్రభుత్వం చేయబోయే పనులపై స్పష్టమైన కార్యాచరణను ప్రజల ముందు పెట్టాలని, ఇప్పటికే ఇచ్చిన హామీల అమలు పురోగతిపై ప్రజలకు సమాధానం చెప్పాలని రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు.

‘ఫిరంగులు పేలుద్దాం’, ‘గడీలను కూల్చుదాం’ వంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి స్థాయికి తగినవి కావన్నారు. తెలంగాణ ఉద్యమం, ప్రజల పోరాట చరిత్రను గుర్తు చేసుకుని బాధ్యతాయుతమైన భాషను ఉపయోగించాల్సిన అవసరం ఉందని హితువు ప‌లికారు. అభివృద్ధి గురించి అడిగితే సమాధానం లేదు. హామీల అమలుపై ప్రశ్నిస్తే సమాధానం లేదు. కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు జవాబు లేదు. కానీ వ్యక్తిగత విమర్శలు చేయడంలో మాత్రం ముఖ్యమంత్రి ముందుంటున్నాడ‌ని రవీంద్ర కుమార్ దుయ్య‌బ‌ట్టారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులు, చేనేత కార్మికులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేయడం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ప్రతిపక్ష నాయకులపై రాజకీయ విమర్శలు చేయడం కంటే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం, రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడం ముఖ్యమని ఆయ‌న అన్నారు. కక్షసాధింపు రాజకీయాలను పక్కనపెట్టి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఆయన రేవంత్‌కు సూచించారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని స‌రైన స‌మ‌యంలో త‌గిన విధంగా బుద్ధి చెబుతార‌ని ఆయ‌న పేర్కొన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Tirumala | గోగర్భం వరకు క్యూలైన్‌లో భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలుRaaka | రెండు పార్టులుగా అల్లు అర్జున్ ‘రాకా’? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com