☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Chakali Ilamma | 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంత్యోత్సవాలు : రావుల సుదర్శన్

ఈనెల 26 శనివారం ఉదయం 10:30 గంటలకు కాపువాడ భద్రకాళి చెరువు సమీపంలోని లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద ఉన్న వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలను నిర్వహిస్తామ‌ని వీరనారి బహుజన చాకలి ఐలమ్మ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రావుల సుదర్శన్ తెలిపారు.
Chakali Ilamma | 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంత్యోత్సవాలు : రావుల సుదర్శన్

హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 24: వీరనారి బహుజన చాకలి అయిలమ్మ పౌండేషన్, బహుజన చాకలి ఐలమ్మ ఫౌండేషన్, రజక మిత్రమండలి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఈనెల 26 శనివారం ఉదయం 10:30 గంటలకు కాపువాడ భద్రకాళి చెరువు సమీపంలోని లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద ఉన్న వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలను నిర్వహిస్తామ‌ని వీరనారి బహుజన చాకలి ఐలమ్మ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రావుల సుదర్శన్ తెలిపారు. గురువారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సమాజంలో అన్ని వర్గాల వారిని ఐక్యం చేసి బడుగు బలహీన వర్గాలను సంఘటితం చేసి ఉద్యమ పోరాటంలో ముందు నిలిచిన మహా వనితగా గుర్తింపు వచ్చింది. ఆ వీరినారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల్లో స్మరించుకోవాలని బాధ్యత మనందరి పైన ఉన్నదన్నారు.

కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, అధికార భాష సంఘం అధ్యక్షులు కూరపాటి వెంకట నారాయణ, కుడా మాజీ చైర్మన్ ఎస్.సుందర్ రాజు యాదవ్, స్థానిక కార్పొరేటర్లు పాల్గొంటారన్నారు. అనంతరం వివిధ కుల సంఘాల చెందిన నాయకులు విశిష్ట సేవలందించిన వారిని సత్కరించడం జరుగుతుందన్నారు. ఉమ్మడి వరంగల్ రజక మిత్రమండలి వరంగల్ జిల్లా బాధ్యులు పాలడుగుల ఆంజనేయులు,ఓరుగంటి పూర్ణచందర్, చీకటి వీరస్వామి, నాగపురి సంతోష్ కుమార్, మాజీ కార్పొరేటర్ కానుగంటి శేఖర్, సాగంటి ప్రకాష్ పాల్గొన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Ram Charan | అక్టోబర్‌లో పట్టాలెక్కనున్న మెగా పవర్ స్టార్ ‘RC17’.. సుకుమార్ మాస్టర్ ప్లాన్!KCR Song | కేసీఆర్ పాటలు పెట్టినందుకు భక్తులపై ఎస్‌ఐ దౌర్జన్యం.. వీడియో →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com