☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Ram Charan | అక్టోబర్‌లో పట్టాలెక్కనున్న మెగా పవర్ స్టార్ ‘RC17’.. సుకుమార్ మాస్టర్ ప్లాన్!

Ram Charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న 'RC17' సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.
Ram Charan | అక్టోబర్‌లో పట్టాలెక్కనున్న మెగా పవర్ స్టార్ ‘RC17’.. సుకుమార్ మాస్టర్ ప్లాన్!

Ram Charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘RC17’ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘రంగస్థలం’ లాంటి పెద్ద హిట్ తర్వాత ఈ ఇద్దరి కలయికలో సినిమా వస్తుండటంతో అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం, దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 20న ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించబోతున్న‌ట్లు తెలుస్తుంది. ఆ తర్వాత నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా కోసం రామ్ చరణ్ తన లుక్‌ను మార్చుకుంటున్నారు. ‘పెద్ది’ సినిమా కోసం ఒక ప్రత్యేక లుక్‌లో కనిపించిన ఆయన, సుకుమార్ సినిమా కోసం మరింత బరువు తగ్గుతూ స్లిమ్‌గా మారుతున్నారు. ఇటీవల బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఆయన కనిపించిన తీరు చూసి అభిమానులు ఈ మేకోవర్ గురించి మాట్లాడుకుంటున్నారు. సుకుమార్ సినిమాలను చాలా పకడ్బందిగా తెరకెక్కిస్తారు కాబట్టి, షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తగినంత సమయం కేటాయించి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Bala Krishna | ట్రంప్‌కు ఇరాన్ అదిరిపోయే కౌంటర్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ సీన్‌తో సెటైర్Chakali Ilamma | 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంత్యోత్సవాలు : రావుల సుదర్శన్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com