☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Bala Krishna | ట్రంప్‌కు ఇరాన్ అదిరిపోయే కౌంటర్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ సీన్‌తో సెటైర్

Bala Krishna | అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరోసారి సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర మలుపు తీసుకున్నాయి. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఇరాన్ అనూహ్య రీతిలో స్పందించింది. అందుకోసం ఏకంగా టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమాలోని యాక్షన్ సన్నివేశాన్ని ఉపయోగించింది.
Bala Krishna | ట్రంప్‌కు ఇరాన్ అదిరిపోయే కౌంటర్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ సీన్‌తో సెటైర్

Bala Krishna | అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరోసారి సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర మలుపు తీసుకున్నాయి. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఇరాన్ అనూహ్య రీతిలో స్పందించింది. అందుకోసం ఏకంగా టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమాలోని యాక్షన్ సన్నివేశాన్ని ఉపయోగించింది.ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రసంగించిన ట్రంప్.. ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేసే స్థాయిలో చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని చెబుతూ.. గతంలో అమెరికా చేపట్టిన సైనిక చర్యలను కూడా ఆయన సమర్థించారు. ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి కొనసాగుతోందని, ఆ దేశం చివరకు ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలకు స్పందిస్తూ జింబాబ్వేలోని ఇరాన్ రాయబార కార్యాలయం తన సామాజిక మాధ్యమ ఖాతాలో బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ సినిమాలోని సుమారు 58 సెకన్ల యాక్షన్ క్లిప్‌ను పంచుకుంది. సినిమాలో బాలకృష్ణ పాత్ర అనేక మంది దాడి చేస్తున్న సమయంలో వారిని ఎదుర్కొనే సన్నివేశాన్ని వీడియోలో చూపించారు. ఈ సన్నివేశాన్ని ట్రంప్ వ్యాఖ్యలకు కౌంట‌ర్‌గా ఉపయోగించింది. వీడియోతో పాటు ఇరాన్ రాయబార కార్యాలయం.. ‘‘ఇరాన్‌ను నాశనం చేస్తామని ట్రంప్ మాట్లాడుతున్నారు. కానీ ఇరాన్ నిస్సహాయమైన దేశం కాదని ఆయనకు తెలుసు. మేము చెప్పినప్పటి నుంచి వారు హాలీవుడ్‌కు బదులుగా బాలీవుడ్ సినిమాలు చూస్తున్నారు’’ అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యను జోడించింది. దీంతో ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అయింది.

అయితే ఇక్కడ ఓ ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ఇరాన్ రాయబార కార్యాలయం పోస్టులో ఈ సినిమాను ‘బాలీవుడ్’ సినిమాగా పేర్కొనగా.. ‘భగవంత్ కేసరి’ వాస్తవానికి తెలుగు సినిమా. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడ్‌కు చెందినదే. ఈ విషయాన్ని పలువురు నెటిజన్లు కూడా ఇరాన్ పోస్టు కింద గుర్తుచేస్తున్నారు. ఇరాన్ చేసిన ఈ సోషల్ మీడియా పోస్టుతో అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతల మధ్య తెలుగు సినిమా సన్నివేశం ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది. బాలకృష్ణ అభిమానులు, తెలుగు సినీ అభిమానులు ఈ పోస్టును ఆసక్తిగా పంచుకుంటూ స్పందిస్తున్నారు. బాలయ్య యాక్షన్ సన్నివేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో పొలిటిక‌ల్ కౌంట‌ర్‌గా ఉపయోగించడం ఆసక్తికరంగా ఉందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← President Murmu | కాంస్యం గెలిచిన భార‌త మెన్స్ బ్యాడ్మింట‌న్ జ‌ట్టుకు రాష్ట్ర‌ప‌తి అభినంద‌న‌లు..!Ram Charan | అక్టోబర్‌లో పట్టాలెక్కనున్న మెగా పవర్ స్టార్ ‘RC17’.. సుకుమార్ మాస్టర్ ప్లాన్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com