☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Revanth reddy | దండలు మరచి, తిట్ల దండకం.. రేవంత్‌ మాట్లాడుతుండగానే వెనుదిరిగిన జనం

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి సిరిసిల్ల కార్మికక్షేత్రానికి వచ్చిన రేవంత్‌రెడ్డి.. నేతన్నలకు ఒనగూరే మాటలేవీ చెప్పకపోవడమేగాక.. అమరులకు అవమా నం కలిగేలా వ్యవహరించారు. నేతన్నలకు నెలవైన గడ్డపై ఆ నేతన్నల కాంస్య విగ్రహానికి దండ వేయకపోగా, ఎప్పటిలాగే ప్రతిపక్ష నేతలపై తిట్ల దండకం అందుకున్నారు. దేశం మొత్తం మహోన్నత వ్యక్తిగా గౌరవించే డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసేందుకు మనసొప్పలేదు.
Revanth reddy | దండలు మరచి, తిట్ల దండకం.. రేవంత్‌ మాట్లాడుతుండగానే వెనుదిరిగిన జనం
  • సిరిసిల్లలో మహనీయులను మరచిన సీఎం
  • పాదయాత్రలో దండ కూడా వేసేందుకు మనసొప్పని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
  • అంబేద్కర్‌, నేతన్న, దామోదరం సంజీవయ్య విగ్రహాలు, అమరవీరుల స్తూపానికి అవమానం
  • 50 నిమిషాలు మాట్లాడినా నేతన్నలకు రిక్త‘హస్తం’
  • ముంపు గ్రామాల ఊసెత్తని ముఖ్యమంత్రి
  • మండలిలో నేతన్న బిడ్డకు అవకాశమని ఆశలు
  • చేతినిండా పని కల్పిస్తున్నా నేతన్నలు చేస్తలేరు
  • చేనేత కార్మికులపై మంత్రి తుమ్మల నెపం
  • రేవంత్‌ మాట్లాడుతుండగానే వెనుదిరిగిన జనం

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి సిరిసిల్ల కార్మికక్షేత్రానికి వచ్చిన రేవంత్‌రెడ్డి.. నేతన్నలకు ఒనగూరే మాటలేవీ చెప్పకపోవడమేగాక.. అమరులకు అవమా నం కలిగేలా వ్యవహరించారు. నేతన్నలకు నెలవైన గడ్డపై ఆ నేతన్నల కాంస్య విగ్రహానికి దండ వేయకపోగా, ఎప్పటిలాగే ప్రతిపక్ష నేతలపై తిట్ల దండకం అందుకున్నారు. దేశం మొత్తం మహోన్నత వ్యక్తిగా గౌరవించే డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసేందుకు మనసొప్పలేదు. తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యకు దండవేయకుండా దాటేసుకుంటూ వెళ్లారు. దాదాపు 50 నిమిషాలు మాట్లాడిన సీఎం.. నేతన్నలకు ఏం చేస్తారో ఒక్క హామీ ఇవ్వలేదు. ఇక మధ్యమానేరు నిర్వాసితులు, ముంపు గ్రామాల ఊసేలేకుండా ప్రసంగం ముగించారు. సీఎం సభ నేత కార్మికులకు ఎలాంటి ఓదార్పునివ్వకపోగా.. వారి ఆశలపై నీళ్లు చల్లింది.

అడుగడుగునా అవమానం
ప్రజాపాలన ప్రగతి పథంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. ముందుగా కరీంనగర్‌ కలెక్టరేట్‌తోపాటు పలు ప్రారంభోత్సవాలు చేశారు. ఆ తర్వాత రాజన్న సిరిసిల్లకు చేరుకొని పలు కార్యక్రమాలు ప్రారంభించారు. అక్కడినుంచి అంబేద్కర్‌ చౌరస్తా నుంచి బహిరంగ సభ వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్లారు. అయితే సిరిసిల్ల నడిబొడ్డున ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌కు విగ్రహానికి పూలమాల వేసి.. అక్కడినుంచి పాదయాత్ర చేసేలా అధికారయంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

కానీ ఈ విషయాన్ని సీఎం దృష్టికి అధికారులు తీసుకెళ్లినా.. దండ వేయకుండానే ఆయన పాదయాత్ర ప్రారంభించారు. సిరిసిల్ల గడ్డపై దళిత కార్డును ప్రయోగించి లబ్ధిపొందాలని చూసిన ఆయనే అంబేద్కర్‌ను అవమానించే వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే దారిలో నేతన్న చౌరస్తా మీదుగా వెళ్లిన సీఎం ఇక్కడ అదే పనిచేశారు. నిజానికి సిరిసిల్ల అంటే నేతన్నలకు పుట్టినిల్లు. ఇదే గడ్డపై నేతన్న కాంస్య విగ్రహాన్ని తమ ప్రతీకగా చెప్పుకొంటారు.

ఈ విగ్రహానికి కూడా పూలమాల వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినా ముఖ్యమంత్రి అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇక ఇదే చౌరస్తాలో అమరవీరుల స్తూపం ఉన్నది. నిజానికి తెలంగాణ ఏర్పడిందే అమరుల త్యాగాలపైన. అందుకే అధికారులు ముఖ్యమంత్రి నివాళులర్పిస్తారన్న ఉద్దేశంతో ఏర్పాట్లు చేశారు. అక్కడా ముఖ్యమంత్రి అదే తీరుగా వ్యవహరించగా, కనీసం మంత్రులెవరూ కూడా నివాళులర్పించలేదు. ఎస్సీకాలనీ సంజీవయ్యనగర్‌ దారిలో ఉన్న సంజీవయ్య విగ్రహానికి పూలమాల వేయలేదు. పట్టణంలోని అన్ని కూడళ్లలో సీఎం ఇలా దాటవేస్తూ వెళ్లిపోవడంలో జనమంతా నివ్వెరపోయారు.

Sircilla

నేతన్నలకు మొండిచేయి
కార్మిక క్షేత్రానికి తొలిసారి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి తమకు హామీలు ఇస్తారని ఆశించిన నేతన్నలకు నిరాశే మిగిలింది. దాదాపు గంటపాటు ప్రసంగించినా ఒక్క కొత్త హామీ ఇవ్వకపోవడం ఆవేదన కలిగింది. పదేండల్లో నేతన్నల సంక్షేమానికి కేసీఆర్‌ సర్కార్‌ 2,234 కోట్లు ఖర్చు చేస్తే.. కాంగ్రెస్‌ పాలనలో రూ.1,731 కోట్లు ఖర్చుచేసినట్టు చెప్పినా.. వాటిని వేటికి ఖర్చు చేశారో ముఖ్యమంత్రి వివరించలేకపోయారు. జీవో 1ని అమలుచేయాలని, ప్రభుత్వ స్కూల్స్‌ అర్డర్స్‌ తమకే ఇవ్వాలని, వర్క్‌టూ ఓనర్‌ పథకాన్ని అమల్లోకి తేవాలని, నేతన్నలు అత్మహత్యల పాలు కాకుండా చేతినిండా ఉపాధి కల్పించాలన్న డిమాండ్లను ముఖ్యమంత్రి కనీసం ప్రస్తావించలేదు.

ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించడం అటుంచి.. కొత్త ఆశలు రేపారు. వచ్చే శానసమండలి ఎన్నికల్లో ఓ నేతన్నకు అవకాశం కల్పిస్తామని నమ్మించే ప్రయత్నం చేశారు. అదే నిజమైతే ఇటీవల బీసీ మహిళ, పద్మశాలీ బిడ్డను మంత్రి పదవి నుంచి ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా నమ్మించే ప్రయత్నం చేయడమే నేతన్నలు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిని ఎవరిని గెలిపించినా వారికి మంత్రి పదవి ఇస్తామంటూ కొత్త పల్లవి అందుకున్నారు. కాంగ్రెస్‌కు అధిష్టానం ఉంటుందని మంత్రి పదవులు వారే నిర్ణయిస్తారంటూ చెప్పుకొచ్చే వారే.. మంత్రి పదవి అంటూ అశలు కల్పించడం కేవలం భ్రమపెట్టేందుకు మాత్రమే అన్న విమర్శలు వస్తున్నాయి.

నిజానికి నేతన్నల గడ్డపై జరిగిన మీటింగ్‌లో ఆత్మహత్యలు ఆపడానికి గానీ, నిరంతర ఉపాధి కల్పించడానికి, రద్దు చేసిన స్కూల్‌ డ్రెస్‌లు ఆర్డర్లు ఇవ్వడానికి, మరమగ్గాల ఆధునీకరణకు గానీ ఎటువంటి హమీఇవ్వకపోవడంతో ఈ సమావేశం ఎందుకు పెట్టారని అధికార పార్టీలోనే చర్చ నడుస్తున్నది. ముంపు నిర్వాసితుల ఇండ్ల నిర్మాణానికి సంబంధించి రూ.5.04 లక్షలు ఇస్తామన్న హామీని స్వయంగా ఆది శ్రీనివాస్‌ గుర్తుచేసినా.. ముఖ్యమంత్రి మాత్రం ఆ ఊసే ఎత్తలేదు. నిర్వాసితులకు ఉపాధి కల్పనకు సంబంధించి పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాలపై కనీసం ముఖ్యమంత్రి మాట్లాడకపోవంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Revanth1

నేతన్నలతో మాట్లాడేందుకు మనసొప్పని సీఎం
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా వారం రోజులుగా ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సహా పలువురు మంత్రులు సిరిసిల్లలో నేతన్నల సంఘాలతో సమావేశాలు పెట్టారు. సమస్యలపై నేరుగా ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించేందుకు అవకాశం కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. సభను సక్సెస్‌ చేసేందుకు సహకరించాలని కోరారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం వారిని కలిసేందుకు అవకాశం కల్పించిన దాఖలాలు మాత్రం కనిపించలేదు. నేతన్నలపై నిజంగానే ప్రేముంటే ఎందుకు కల్పించలేదనే కార్మికులు మండిపడుతున్నారు.

సీఎం మాట్లాడుతుండగానే వెళ్లిపోయిన జనం
సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగంపై జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. ప్రసంగం ప్రారంభించినప్పటి నుంచే జనం గుంపులు గుంపులుగా లేచి వెళ్లడం కనిపించింది. పోలీసులు వారించినా వినకుండా బారికేడ్లు దాటుకొని వెళ్లిపోయారు. దీంతో ప్రసంగం సగం కూడా కాకముందే.. జనం వెనుతిరగడంతో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. వెళ్లిపోతున్న వారిని అక్కడక్కడా కాంగ్రెస్‌ శ్రేణులు అడ్డుకున్నా వారి మాటలను ఖాతరు చేయలేదు. అంతేగాక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు కూడా జనం నుంచి ఆశించిన స్పందన రాలేదని పార్టీ నాయకులే గుసగుసలాడుకోవడం కనిపించింది.

నిరసనల నుంచి తప్పించుకోవడానికి నిధుల విడుదల
నిరసనల నుంచి తప్పించుకోవడానికి గాను.. మూడేండ్లుగా పెండింగ్‌లో పెట్టిన బకాయిలు, పలు జీవోలను ఆగమేఘాల మీద విడుదల చేశారు. సిరిసిల్లలో పద్మశాలీ భవన నిర్మాణానికి పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇటీవల సర్కాను హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనకు కొన్ని గంటల ముందు రూ.2కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే మూడేండ్లుగా పెండింగ్‌లో ఉన్న వస్త్ర పరిశ్రమకు బకాయిలు రూ.141.48 కోట్లు విడుదల చేసింది. ఇన్నేండ్లుగా గుర్తుకురాని బకాయిలు.. ఇప్పుడైనా విడుదల చేయడం కేవలం సభలో నిరసనలు వ్యక్తం కాకుండా ఉండేందుకు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బీఆర్‌ఎస్‌ ప్రశ్నలకు జవాబు చెప్పని సీఎం

  • అసెంబ్లీ సాక్షిగా సీఎం ఇటీవల బీఆర్‌ఎస్‌ నాయకులపై చేసిన ఆరోపణల విషయం

తెలిసిందే. సిరిసిల్లలో 8వేల ఎకరాల సర్కార్‌ భూములను కేటీఆర్‌ బంధువులకు ధారాదత్తం చేసుకున్నారని, ఇందులో 2,400 ఎకరాలు రాబట్టామంటూ.. పలువురు పేర్లను ప్రస్తావించారు. అయితే ఆ భూముల వివరాలను ఆధారాలతో బహిర్గతం చేయాలని కేటీఆర్‌ ఇప్పటికే సవాల్‌ విసిరారు. అలాగే రికవరీ చేసినట్టు చెపుతున్న భూముల వివరాలను వెల్లడించాలని కోరారు. కానీ సభా వేదికపై వాటిని ప్రస్తావించిన సీఎం.. ఆ వెంటనే మాట మార్చారు. అసెంబ్లీలో మాట్లాడిన 8వేల ఎకరాల భూముల గురించి ఒక్క వివరాలు కూడా వెల్లడించలేదు. అలాగే స్వాధీనం చేసుకున్నట్టు చెప్పినా.. భూముల వివరాలు వెల్లడించలేదు.

చేతినిండా పని ఇస్తున్నా.. చేయలేకపోతున్నరు

  • సభాసాక్షిగా మంత్రి తుమ్మల అబద్ధాలు

చేతినిండా పని ఇస్తున్నా నేత కార్మికులు చేయలేకపోతున్నారంటూ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్‌కు మించి నేతన్నలకు పని కల్పిస్తున్నామని, తమ ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్ల ప్రకారం కూడా నేతన్నలు చేయలేకపోతున్నారని చెప్పుకొచ్చారు. ఓ వైపు ఉపాధి లేక నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆ విషయాన్ని కప్పించేందుకు ఏకంగా నేతన్నలపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తూ సభలో అబద్ధాలు వల్లిస్తున్నారంటూ కార్మికులు భగ్గుమంటున్నారు. అదే నిజమైతే.. తమకు స్కూల్‌ దుస్తుల అర్డర్లు ఇవ్వాలని ఎందుకు డిమాండ్‌ చేస్తామని, చేతినిండా ఉపాధి ఉంటే మరమగ్గాలు ఎందుకు మూతపడుతున్నాయని, కార్మికులు మళ్లీ ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. పని ఇవ్వకపోగా.. తిరిగి కార్మికులపైనే నెపం నెట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Horoscope | 01-10-2026 గురువారం.. మీ రాశి ఫలాలుLPG Cylinder Price : పండుగల వేళ గ్యాస్ వినియోగదారులకు భారీ షాక్.. ధరలు పైపైకి.. ఏపీ, తెలంగాణలో కొత్త రేటు ఇదే! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com