☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Young Stroke | యువతలో పెరుగుతున్న పక్షవాతం కేసులు.. ముప్పు కలిగించేవి ఏవి?

Young Stroke | ఇటీవల పక్షవాతం కేసులు చూస్తుంటే యువతలోనే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. పరిశోధనలు కూడా యువతలోనే పక్షవాతం రేటు దాదాపు రెట్టింపయ్యిందని వెల్లుడిస్తున్నాయి.
Young Stroke | యువతలో పెరుగుతున్న పక్షవాతం కేసులు.. ముప్పు కలిగించేవి ఏవి?

Young Stroke | సాధారణంగా పక్షవాతం (Stroke) అనేది వృద్ధాప్యానికి సంబంధించిన సమస్యగా పరిగణిస్తాం. ఇటీవలి పరిశోధనలు ఈ అభిప్రాయాన్ని మారుస్తున్నాయి. గత మూడు దశాబ్దాల్లో 20 నుంచి 54 ఏండ్ల వయస్సు గల వారిలో పక్షవాతం సంభవించే రేటు దాదాపు రెట్టింపయ్యిందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. దీనిపై అమెరికాలో చేపట్టిన అధ్యయన వివరాలు సెప్టెంబర్‌ 23న న్యూరాలజీ (Neurology) అనే పత్రికలో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయన వివరాలు 1993 నుంచి 2020 మధ్య కాలంలో గ్రేటర్‌ సిన్సినాటి, ఉత్తర కెంటకీ ప్రాంతాలకు చెందినవి. 20 నుంచి 54 ఏండ్ల వయసు గల వారిలో మొదటిసారి పక్షవాతం వచ్చిన 2076 కేసులను గుర్తించారు. లక్షకు 33.9 కేసులు నమోదవగా, 2020 నాటికి అది 62.2కు చేరింది.

ఇస్కీమిక్‌ స్ట్రోక్స్‌ (Ischemic Strokes) కేసులే ఎక్కువగా ఉన్నాయి. అంటే మెదడులో ఏర్పడిన బ్లడ్‌ క్లాట్‌ లేదా ఇతర ఏదైనా ఇతర ఏదైనా అవరోధం ఒక భాగానికి రక్త ప్రసరణను అడ్డుకోవడం వల్ల ఇది సంభవిస్తుంది. ఈ రకమైన పక్షవాతం ఈ అధ్యయనం కాలంలో లక్షకు 23.8 నుంచి 47.3 కేసులకు పెరిగింది. అయితే పరిశోధకులు ఇంట్రాసెరెబ్రల్‌ లేదా సబర్నకాయిడ్‌ హేమరేజెస్‌ విషయంలో ఇలాంటి పెరుగుదలను గుర్తించలేదు.

Treatment

Treatment

యువకుల్లో ఈ పక్షవాతం పెరుగుదలలకు సరైన కారణాన్ని పరిశోధకులు ఇప్పటివరకు గుర్తించలేదు. కానీ పక్షవాతానికి గురైన యువకుల్లో ఎక్కువగా మధుమేహం (Daibetes), అట్రియల్‌ ఫైబ్రిలేషన్‌, అధిక బీపీ ఉన్నట్లు తేల్చారు. అంతేకాదు మత్తు పదార్థాల వినియోగం వల్ల కూడా ఈ పక్షవాతం సంభవిస్తున్నట్లు గమనించారు. వీటి వినయోగం 1993-94లో 4.6 శాతం నుంచి 2020 నాటికి 40.2 శాతానికి పెరిగింది. దీనిలో అధిక భాగం గంజాయి వాడకం వల్లనే సంభవింయింది. ఈ అధ్యయనం ఒక్క అమెరికాకే కాకుండా ప్రపంచంలోని 204 దేశాలకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా 1990 నుంచి 2021 మధ్య 15 నుంచి 49 ఏండ్ల సంవత్సరాలు గల వారిలో పక్షవాత కేసులు 36 శాతం పెరిగినట్లు గుర్తించారు. దీనికి అధిక సిస్టోలిక్‌ బీపీ, అధిక బాడీ మాస్‌ ఇండెక్స్‌ (BMI), పెరిగిన LDL కొలెస్ట్రాల్‌, రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు వేగంగా పెరగడం, వాయు కాలుష్యం వంటివి కారణాలు అని పరిశోధకులు వెల్లడించారు.

భారతీయుల పరిస్థితి ఏంటి?
అధిక బరువు (Excess Weight), పొగ తాగడం, శారీరక శ్రమ లేకపోవడం, అధిక బీపీ, అధికంగా మధ్య తాగడం, ఆహార అలవాట్లలో మార్పు, అధిక కొలెస్ట్రాల్‌ ఇవన్నీ పక్షవాతం రావడానికి కారకాలు అని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ ఇవే ప్రధాన కారణమని యూఎస్‌ చేపట్టిన కొత్త పరిశోధన నిరూపించలేదు. అయినప్పటికీ వీటిలో చాలా వాటిని మనం మార్చుకుంటే మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. పక్షవాతానికి ప్రధాన కారణం అధిక రక్తపోటు (High BP) అని గుర్తించారు.

అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?
అధ్యయనాల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ వయసుతో సంబంధం లేకుండా వచ్చే అకస్మాత్తుగా వచ్చే నాడీ సంబంధిత (Neurological) వ్యాధులను నిర్లక్ష్యం చేయకూడదు. అకస్మాత్తుగా వచ్చే నీరసం లేదా తిమ్మిరి, శరీరంలోని ఒకవైపునకు ముఖం వాలిపోవడం, వదలని తలనొప్పి, మాట్లాడటంలో ఇబ్బంది, అకస్మాత్తుగా దృష్టిలోపాలు, తల తిరగడం వంటి పక్షవాతానికి సంకేతాలు కావచ్చు. కాబట్టి వీటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Checkup

Checkup

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Danam Nagender | సుప్రీంకోర్టు ఇచ్చిన షాక్‌తో దానం సెట్‌రైట్‌.. ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతాన‌ని ప్ర‌క‌ట‌న‌..!TFTDDA President | డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై దాడి.. చంపుతామంటూ బెదిరింపులు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com