☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Danam Nagender | సుప్రీంకోర్టు ఇచ్చిన షాక్‌తో దానం సెట్‌రైట్‌.. ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతాన‌ని ప్ర‌క‌ట‌న‌..!

Danam Nagender | గ‌డిచిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచి క‌నీసం ఆరు నెల‌లైనా తిర‌గ‌క‌ముందే అధికార కాంగ్రెస్‌లోకి జంప్ అయిన దానం నాగేంద‌ర్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. త‌న‌పై అన‌ర్హ‌త వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ.. దానం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. తాజాగా సుప్రీంకోర్టు ఆ పిటిష‌న్‌ను కొట్టివేసింది. దాంతో ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.
Danam Nagender | సుప్రీంకోర్టు ఇచ్చిన షాక్‌తో దానం సెట్‌రైట్‌.. ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతాన‌ని ప్ర‌క‌ట‌న‌..!

Danam Nagender : గ‌డిచిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచి క‌నీసం ఆరు నెల‌లైనా తిర‌గ‌క‌ముందే అధికార కాంగ్రెస్‌లోకి జంప్ అయిన దానం నాగేంద‌ర్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. త‌న‌పై అన‌ర్హ‌త వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ.. దానం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. తాజాగా సుప్రీంకోర్టు ఆ పిటిష‌న్‌ను కొట్టివేసింది. దాంతో ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.

సుప్రీంకోర్టు షాక్‌తో దిమ్మ‌తిరిగిపోయిన దానం.. ఇక ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతాన‌ని ప్ర‌క‌టించారు. కాగా బీఆరెస్ పార్టీ నుంచి గెలిచిన దానం రెండేళ్ల‌కుపైగా అక్ర‌మంగా ప‌ద‌విని అనుభ‌విస్తూ కాంగ్రెస్ పార్టీతో అంట‌కాగారు. ఏకంగా కాంగ్రెస్ టికెట్‌పై సికింద్రాబాద్ పార్ల‌మెంట్ స్థానానికి పోటీ కూడా చేశారు. దాంతో ఆయ‌నపై అన‌ర్హ‌త వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆలేటి మ‌హేశ్వ‌ర్‌రెడ్డి పిటిష‌న్‌లు వేశారు.

విచార‌ణ జ‌రిపిన తెలంగాణ హైకోర్టు ఇటీవ‌ల దానం నాగేంద‌ర్‌పై అన‌ర్హ‌త వేటు వేసింది. హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ దానం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును స‌మ‌ర్థిస్తూ దానం పిటిష‌న్‌ను కొట్టివేసింది. దాంతో దానంకు దిమ్మ‌తిరిగింది. దాంతో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సంపూర్ణంగా గౌరవిస్తున్నానని ప్ర‌క‌టించారు. చట్టపరమైన ప్రక్రియ పట్ల ఉన్న గౌరవంతోనే తాను న్యాయపోరాటం చేశానని చెప్పారు. ఇక తన భవిష్యత్తును ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటానని అన్నారు.

కోర్టు తీర్పు ఇలా వస్తుందని తాను ముందే ఊహించానని దానం అన్నారు. అయితే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ నిబంధనల ప్రకారం కొంత ఊరట లభిస్తుందని భావించానని చెప్పారు. అందుకే చట్టపరంగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశానని పేర్కొన్నారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో తాను సిద్ధంగా ఉన్నట్లు దానం తెలిపారు. ఖైరతాబాద్‌ ప్రజలతో తనకు దశాబ్దాలుగా అనుబంధం ఉందన్నారు. రాబోయే ఉపఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లి వారి ఆశీర్వాదం కోరతానన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Vehicle Catches Fire | స్తంభాన్ని ఢీకొట్టిన వాహనం.. మంటలు చెలరేగడంతో ఇద్దరు సజీవ దహనంYoung Stroke | యువతలో పెరుగుతున్న పక్షవాతం కేసులు.. ముప్పు కలిగించేవి ఏవి? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com