☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Vehicle Catches Fire | స్తంభాన్ని ఢీకొట్టిన వాహనం.. మంటలు చెలరేగడంతో ఇద్దరు సజీవ దహనం

Vehicle Catches Fire | ఒక వాహనం అదుపుతప్పింది. డివైడర్‌తో పాటు స్ట్రీట్‌ లైట్‌ పోల్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో ఆ వాహనంలో మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. తీవ్ర కాలిన గాయాలైన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది.
Vehicle Catches Fire | స్తంభాన్ని ఢీకొట్టిన వాహనం.. మంటలు చెలరేగడంతో ఇద్దరు సజీవ దహనం

గువాహతి: ఒక వాహనం అదుపుతప్పింది. డివైడర్‌తో పాటు స్ట్రీట్‌ లైట్‌ పోల్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో ఆ వాహనంలో మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. తీవ్ర కాలిన గాయాలైన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. (Vehicle Catches Fire) అస్సాంలోని నాగావ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నలుగురు వ్యక్తులు అరుణాచల్ ప్రదేశ్ నుంచి గువాహతికి కియా కారులో ప్రయాణమయ్యారు. గురువారం తెల్లవారుజామున పురానీ గూడంలోని కెనపట్టి ప్రాంతంలో ఆ కారుపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడు. దీంతో అది డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత డివైడర్‌ మధ్యలోని వీధి లైట్‌ స్తంభాన్ని ఢీకొట్టి పల్టీలు కొట్టింది.

కాగా, ఈ ప్రమాదం ధాటికి ఆ కారులో మంటలు చెలరేగాయి. ప్రయాణిస్తున్న నలుగురు అందులో చిక్కుకుపోయారు. ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా కాలిన గాయాలైన మరో ఇద్దరిని గువాహతిలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Shah Rukh Khan | రూ.2,490 కోట్లు తగ్గిన షారుఖ్ ఖాన్ సంపద.. అసలు కారణం ఇదే!Danam Nagender | సుప్రీంకోర్టు ఇచ్చిన షాక్‌తో దానం సెట్‌రైట్‌.. ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతాన‌ని ప్ర‌క‌ట‌న‌..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com