☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

రోహిత్ రీఎంట్రీ.. ఆ స్టార్ ఓపెనర్‌కు షాక్: వెస్టిండీస్‌తో తొలి వన్డేకు టీమిండియా XI ఇదేనా?

రోహిత్ రీఎంట్రీ.. ఆ స్టార్ ఓపెనర్‌కు షాక్: వెస్టిండీస్‌తో తొలి వన్డేకు టీమిండియా XI ఇదేనా?
రోహిత్ రీఎంట్రీ.. ఆ స్టార్ ఓపెనర్‌కు షాక్: వెస్టిండీస్‌తో తొలి వన్డేకు టీమిండియా XI ఇదేనా?
రోహిత్ రీఎంట్రీ.. ఆ స్టార్ ఓపెనర్‌కు షాక్: వెస్టిండీస్‌తో తొలి వన్డేకు టీమిండియా XI ఇదేనా?

IND vs WI Playing XI: వెస్టిండీస్‌తో జరగనున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు రంగం సిద్ధం చేసుకుంది. సెప్టెంబర్ 27వ తేదీన తిరువనంతపురం వేదికగా జరగనున్న తొలి వన్డే కోసం ఇరు జట్లు ఇప్పటికే స్టేడియానికి చేరుకున్నాయి. ఈ సిరీస్ కోసం సెలక్టర్లు చాలా స్ట్రాంగ్ స్క్వాడ్‌ను ఎంపిక చేసినప్పటికీ, తుది జట్టులో ఏయే ప్లేయర్స్ కు చోటు దక్కుతుందనే విషయం ఇప్పుడు సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

శ్రేయస్ అయ్యర్ డుమ్మా.. యువ ఆటగాళ్లకు ఛాన్స్:

స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల జట్టుతో బిజీగా ఉండటంతో ఈ వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదు.. అయినప్పటికీ సెలక్టర్లు పటిష్టమైన జట్టును రంగంలోకి దించబోతున్నారు. రుతురాజ్ గైక్వాడ్, ఆకిబ్ నబీ, నమన్ ధీర్ లాంటి యువ ఆటగాళ్లతో పాటు అనుభవజ్ఞుడైన స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఈ వన్డే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు.

బెంచ్‌కే జైస్వాల్‌కు పరిమితం:

బలమైన జట్టు అందుబాటులో ఉన్నప్పటికీ, కొద్దిమంది స్టార్ ఆటగాళ్లకు తొలి వన్డే తుది జట్టులో స్థానం దక్కడం కష్టంగా మారింది. ముఖ్యంగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్ బెంచ్‌కే పరిమితం అయ్యే కనిపిస్తుంది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా ఇన్నింగ్స్ ప్రారంభించడం ఖాయం కాగా, మూడో స్థానంలో విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. దీంతో టాప్ ఆర్డర్‌లో జైస్వాల్‌కు చోటు దక్కడం కష్టమే అని చెప్పాలి.. ఇప్పటివరకు ఆడిన 6 వన్డేల్లో 71.25 సగటుతో 285 రన్స్ సాధించిన జైస్వాల్ లాంటి కిరాక్ ఫామ్ ఉన్న ప్లేయర్ పక్కన ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నంబర్-4 స్థానంలో రుతురాజ్ గైక్వాడ్:

శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీతో ఖాళీ అయిన నంబర్-4 స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందనే దానిపై క్లారిటీ వచ్చింది. ఈ పొజిషన్‌లో రుతురాజ్ గైక్వాడ్‌ను ఆడించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గైక్వాడ్ ఇప్పటివరకు తన కెరీర్‌లో 9 వన్డేల్లో 228 పరుగులు కొట్టాడు. ఇక కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయనుండగా, ఆల్ రౌండర్ల కోటాలో నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా జట్టుకు అదనపు బలాన్ని చేకూర్చనున్నారు.

ALSO READ : 66 – 28తో థాయ్‌లాండ్ చిత్తు..

భారత్ ప్లేయింగ్ XI అంచనా:

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్


©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← SBI కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. బ్యాంకు సమ్మె టైంలో ఏటీఎం ఛార్జీలు ఉండవ్Mahesh Babu: గడ్డం లేదు బాస్‌.. ఇప్పుడు ఏం చేద్దాం?.. 24 ఏళ్ల కుర్రాడిగా మహేష్ బాబు కొత్త లుక్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com