Rohit Sharma Century Celebrations : భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా రెండో వన్డే బుధవారం గువాహటి వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ బ్యాటుతో అదరగొట్టాడు. 75 బంతుల్లో 101 పరుగులతో మైదానంలో కొద్దిసేపు విధ్వంసం సృష్టించాడు. అంతేకాదు.. 12వేల వన్డే పరుగుల మైలురాయిని చేరుకోవడంతోపాటు సచిన్ టెండూల్కర్ రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు.
రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేసిన తరువాత వెరైటీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. జాగింగ్ చేస్తున్నట్లు రోహిత్ ప్రదర్శించిన హావభావాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియో చూసిన క్రికెట్ ప్రేమికులు ఖుషీ అవుతున్నారు. రోహిత్ ఫ్యాన్స్ అయితే.. ఇది హిట్‌మ్యాన్ సత్తా అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Look what it means to the Hitman
A memorable celebration during a memorable knock
Updates
https://t.co/6XCYRtZLAi#TeamIndia | #INDvWI | @mflone_ | @ImRo45 pic.twitter.com/V5h46wVK11
— BCCI (@BCCI) September 30, 2026
వెస్టిండీస్ జట్టుతో బుధవారం జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం 43.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి అధిగమించింది. దీంతో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో భారత జట్టు కైవసం చేసుకుంది.




A memorable celebration during a memorable knock 




