☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

RTC టికెట్ ధరలపై హరీష్ రావు ఆగ్రహం

TGSRTC : పండుగల వేళ టీజీఎస్‌ఆర్‌టీసీ (TGSRTC) ప్రత్యేక బస్సుల పేరుతో టికెట్ ధరలను విపరీతంగా పెంచడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ జ్యేష్ఠ నాయకుడు హరీష్ రావు...
RTC టికెట్ ధరలపై హరీష్ రావు ఆగ్రహం

TGSRTC : పండుగల వేళ టీజీఎస్‌ఆర్‌టీసీ (TGSRTC) ప్రత్యేక బస్సుల పేరుతో టికెట్ ధరలను విపరీతంగా పెంచడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ జ్యేష్ఠ నాయకుడు హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగలు వస్తే చాలు ఆర్టీసీ ఛార్జీలు పెంచి సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పొడవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన విమర్శలు గుప్పించారు. టికెట్ ధరలను దాదాపు రెట్టింపు చేసి ప్రయాణికుల నుంచి నిలువుదోపిడీ చేయడం అత్యంత సిగ్గుచేటని మండిపడ్డారు. ఉదాహరణకు జేబీఎస్ (JBS) నుంచి కరీంనగర్‌కు సాధారణ రోజుల్లో రూ.230 ఉన్న టికెట్ ధరను పండుగ సాయంత్రానికి ఏకంగా రూ.400కు పెంచేశారని ఆయన ఫైరయ్యారు.

Read Also : తెలంగాణ లో ముగింపు ఘట్టానికి చేరుకున్న బతుకమ్మ సంబరాలు

‘ఉచిత ప్రయాణం ఒకరికి.. భారం ఇద్దరికీ’: సోషల్ మీడియా వేదికగా నిలదీత!

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం (మహాలక్ష్మి) తీరుపై కూడా హరీష్ రావు సామాజిక మాధ్యమం ‘X’ (ట్విట్టర్) వేదికగా ఘాటుగా ప్రశ్నించారు. “ఒకే కుటుంబంలో భార్యకు ఫ్రీ టికెట్ ఇచ్చి, పక్కనే ఉన్న భర్త నుంచి రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తే దాన్ని మహిళలకు ఇచ్చిన రాయితీ అంటారా? లేక అదే కుటుంబంపై అదనపు భారం మోపడం అంటారా?” అని ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. పండుగల సమయంలో సొంత ఊళ్లకు వెళ్లే పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకోవాల్సింది పోయి, ఇలాంటి దోపిడీకి పాల్పడటం సరికాదని.. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్భారత్‌ సిరీస్ గెలవకపోవడానికి కారణం అదేనా? అయ్యర్ ఏమన్నాడంటే! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com